India vs England: ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ లీడ్స్ లోని హెడింగ్లీ స్టేడియంలో మొదలయింది. ఇక టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత జట్టులో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కు టెస్టు అరంగేట్ర అవకాశం లభించింది. ఇటీవల ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన సుదర్శన్ ఎంపికతో కొత్త శక్తిని జట్టులోకి తెచ్చినట్టయింది. ఇక చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న కరుణ్ నాయర్…
IND vs ENG Test Series: ఇంగ్లాండ్ పర్యటన టీమిండియా టెస్ట్ చరిత్రలో ఎప్పుడూ ఓ సవాలుతో కూడిన అధ్యాయం. స్వింగ్, సీమ్‌కు ప్రసిద్ధమైన ఇంగ్లాండ్ పిచ్ లపై భారత్ కు విజయం సాధించడం ఎప్పుడూ కష్టసాధ్యమే. 1932లో మొదటిసారిగా ఇంగ్లాండ్ టూర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో మధురమైన, సవాలుతో కూడిన క్షణాలను భారత జట్టు అనుభవించింది. ఇప్పడు, 2025లో ఇంగ్లాండ్‌లో 18 ఏళ్లుగా సాధించలేని టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించేందుకు కొత్త కెప్టెన్…
Joe Root: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్లో అమలు చేస్తున్న ‘బజ్‌బాల్’ విధానం గురించి తాజాగా స్పందించారు. 2022లో బ్రెండన్ మెక్‌కలమ్ ప్రధాన కోచ్‌గా నియమితులైన తర్వాత, కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కలిసి టీమ్‌కు ఒక కొత్త దిశను సూచించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రూట్ మాట్లాడుతూ.. “బజ్‌బాల్” అనేది సరైన పదం కాదేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. Read Also: Israel Iran War: డేంజర్లో…
WTC 2025-27: సౌతాఫ్రికా 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) టైటిల్ గెలిచిన వెంటనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2025-27 సైకిల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం తొమ్మిది జట్లు కలిసి మొత్తం 71 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. 2025 జూన్ 17న శ్రీలంకలోని గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఇక ఈసారి ఎక్కువ మ్యాచ్‌లు ఆడే జట్లలో ఆస్ట్రేలియా (22 టెస్టులు), ఇంగ్లాండ్ (21 టెస్టులు)…
ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు శనివారం ప్రకటించనున్నారు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పోటీలో ఉన్నారు. అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను గిల్‌కే అప్పగించేందుకు బీసీసీఐ సిద్ధమైందని తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్ చేర్చడం అతడికి కలిసి రానుంది. దీనిపై మరికొన్ని గంటల్లో…
వచ్చే నెలలో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించనుంది. సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. జట్టులో యువకులకు అవకాశం దక్కనుంది. భారత్-ఏ తరఫున ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న వారిలో కూడా టీమిండియాలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. అయితే కీలక టెస్ట్ సిరీస్ ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ…
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు ఇటీవల టెస్టు క్రికెట్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి, అలాగే ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోలేకపోవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శన కూడా తివారంగా నిరాశపరిచింది. ముఖ్యంగా, ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయడం అతడి బ్యాటింగ్…
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ ఓటమి ఎరుగని జట్టుగా సత్తాచాటుతూ.. టైటిల్ ను కైవసం చేసుకుంది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీం ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి క్రికెట్ చరిత్రలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. 19 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇక ఇప్పుడు నెక్ట్స్…
టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. తన 50 వన్డే మ్యాచ్‌లో గిల్ ఈ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా (53 ఇన్నింగ్స్‌ల్లో) రికార్డును బద్దలు కొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులతో 112 రన్స్ బాదాడు. 2019 జనవరి…
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను వైట్‌వాష్ చేసింది. బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌ను 142 పరుగుల తేడాతో ఓడించింది. 357 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్.. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది.