అహ్మదాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటింగ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (1) విఫలమైనప్పటికీ.. మిగతా బ్యాటర్లు మంచి ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (52) అర్ధ శతకంతో రాణించాడు. చాలా మ్యాచ్‌ల్లో ఫేల్ అయిన కింగ్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టీమిండియా బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ (112) శతకంతో చెలరేగాడు. 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (78) హాఫ్ సెంచరీ చేశాడు. 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్ (40) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
Read Also: Kakinada: కాకినాడకు కేరళ సీబీఐ అధికారులు.. కారణమిదే..?
హార్ధిక్ పాండ్యా (17), అక్షర్ పటేల్ (13), సుందర్ (14), హర్షిత్ రాణా (13) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో అత్యధికంగా ఆదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మార్క్ ఉడ్ 2 వికెట్లు తీశాడు. సాకిబ్ మహముద్, గస్ అట్కిసన్, జో రూట్ తలో వికెట్ సంపాదించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 357 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాలి. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. భారత్ రెండు వన్డే మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కేవలం నామమాత్రమే.. కాదంటే, ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది.
Read Also: Anji Reddy Chinnamile : కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఓట్లు అడగాలి….