Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్ పర్యటకు వచ్చారు. భారత్, రష్యాల మధ్య మరిన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలపై చర్చలు జరుగుతాయి. ఇదిలా ఉంటే, ఇండియా టుడే పుతిన్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా వైఖరి, వెస్ట్రన్ దేశాల నైజాన్ని ఎండగట్టారు.
PM Modi: రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా, స్వయంగా ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టుకు వెళ్లి పుతిన్‌ను ఘనంగా స్వాగతించారు. ప్రధాని మోడీ కొంత మంది విదేశీ అతిథుల కోసం మాత్రమే ఇలా ప్రోటోకాల్‌ను బ్రేక్ చేసి, స్వయంగా రిసీవ్ చేసుకున్నారు.
Putin In India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. కాసేపటి క్రితం ఆయన ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయ్యారు. పుతిన్‌ను స్వాగతించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ, ఎయిర్ పోర్టుకు వచ్చారు. పుతిన్‌ను మోడీ ఘనంగా స్వాగతించారు.
India-Russia Deal: ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత రష్యాపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. దీంతో మాస్కో నుంచి ఆయిల్ ను ఇండియా అతి తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంది.
Putin In India: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో అడుగుపెట్టారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రెండు రోజుల పాటు ఇండియా పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ఆయనను స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతించారు. పుతిన్ 23వ ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాలలో పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. పుతిన్ పూర్తి షెడ్యూల్: మొదటి రోజు: * సాయంత్రం 6.35: వ్లాదిమిర్ పుతిన్ పాలం…
Modi-putin: రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరికాసేపట్లో భారత్‌లో ల్యాండ్ కాబోతున్నారు. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్ పర్యటించనున్నారు. ఇప్పటికే, భారత ప్రభుత్వం పర్యటన కోసం అత్యున్నత ఏర్పాట్లను చేసింది. పుతిన్ రాకతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పుతిన్ బస చేసే హోటల్, సందర్శించే ప్రాంతాలను భారత భద్రతా అధికారులతో పాటు రష్యన్ సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Modi – Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు (డిసెంబర్ 4) భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. దేశమే కాకుండా, ప్రపంచం మొత్తం కూడా ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్ భేటీపై ఆసక్తి కనబరుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ తొలిసారిగా భారత్ రాబోతున్నారు. భారత్, రష్యాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు, సంతకాలు జరిగే అవకాశ ఉంది. ముఖ్యంగా చమురు, రక్షణ, వాణిజ్యంపై రెండు దేశాలు చర్చించనున్నాయి. వీటితో పాటు బ్రహ్మోస్, ఎస్-400,…
Russian President Vladimir Putin will visit India on December: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. పుతిన్ పర్యటన కోసం భారతదేశంలో సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా సైనిక బృందం చాలా రోజుల క్రితం వచ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తోంది. అయితే.. ఇంతలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. గత 10 సంవత్సరాలుగా పుతిన్ భారత్ సందర్శించిన తీరు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పదేళ్లలో పుతిన్ ప్రతి పర్యటన ఏడాది…
India Russia Relations: భారత్, రష్యా మధ్య సంబంధాలు ప్రస్తుతం గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఎంత ఒత్తిడి తెచ్చినా భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని సుంకాలు విధించిన భారత్ తగ్గేదేలే అంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌లోని రష్యా రాయబారి కీలక ప్రకటన చేశారు.