India Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌కి రష్యా అందించాల్సిన రెండు స్క్వాడ్రన్ల S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీ ఆలస్యమైంది. అయితే, వీటిని 2026-27 నాటికి పంపిణీ చేస్తామని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి హామీ ఇచ్చారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం సందర్భంగా ఇద్దరూ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాలు దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించాయి.
India Russia: భారత్, రష్యాతో మరో బిగ్ డీల్‌కి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వారం జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ రష్యా పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్ లో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బ్రహ్మోస్ మిస్సైల్స్ పాకిస్తాన్‌ని కాళ్ల బేరానికి తెచ్చాయి.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడేళ్లు పూర్తి చేసుకుంది. రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పుడు.. అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించి దాని ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయి.
Putin: ప్రపంచంలో అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి భారత్‌కి అన్ని అర్హతలు ఉన్నాయని, భారత ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. గురువారం సోచిలోని వాల్డై డిస్కషన్ క్లబ్ ప్లీనరి సెషన్లో పుతిన్ ప్రసంగిస్తూ.. రష్యా భారతదేశంతో అన్ని దిశల్లో సంబంధాలను అభివృద్ధి చేస్తుందని, ద్వైపాక్షిక సంబంధాల్లో గొప్ప విశ్వాసం ఉందని అన్నారు.
India–Russia Relations: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌ను మరోసారి ప్రశంసించారు. తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని చెప్పుకొచ్చారు. భారత్ ఓ గొప్ప దేశం.. వారితో మా సంబంధాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
India Russia: ప్రధాని నరేంద్రమోడీ 16వ బ్రిక్స్ సమ్మిట్ కోసం రష్యా వెళ్లారు. ఈ రోజు ప్రధాని మోడీ, రష్యా అధినేత పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. మాస్కో-న్యూఢిల్లీ సంబంధాలు చాలా ‘‘ప్రత్యేమైనవి, విశేషమైనవి’’, డైనమిక్‌గా అభివృద్ధి చెందాయని పుతిన్ అన్నారు. ఈ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు మోడీకి నవ్వు తెప్పించింది. ‘‘రెండు దేశాల మధ్య గట్టి సంబంధాలు ఉన్నాయి. అనువాదం లేకుండా తన వ్యాఖ్యల్ని ప్రధానిమోడీ అర్థం చేసుకుంటారు’’ అని రష్యా అధ్యక్షుడు…
Jaishankar: భారత-రష్యా సంబంధాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత భారత రష్యా చరిత్రను పరిశీలిస్తే.. భారత ప్రయోజనాలను ప్రభావితం చేసేలా రష్యా ఎప్పుడూ ఏమీ చేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్ సమావేశం కోసం రష్యాకి వెళ్తున్న సందర్భంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రష్యా, ఇండియా ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగించలేదని చెప్పారు.
Russia: భారత్-రష్యా బంధంపై మరోసారి రష్యా ప్రశంసలు కురిపించింది. రష్యాతో సంబంధాల విషయంలో భారత్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.
India- Russia Relations: ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటనపై అమెరికా ఆగ్రహంతో ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్‌కు ఎస్-400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను ముందుగా నిర్ణయించుకున్న గడువు ప్రకారమే అందజేయనున్నట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ‘ఎస్-400’ సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుందేమోనని భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన దేశంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ మాట్లాడుతూ.. S-400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ నిర్ణయించుకున్న…