Jagdeep Dhankhar: భారత్ పాకిస్తాన్‌పై నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ప్రశంసించారు. పాకిస్తాన్ లోకి దూరి అమెరికన్ దళాలు అల్ ఖైదా చీఫ్ ‘‘ ఒసామా బిన్ లాడెన్’’ని చంపిన ఆపరేషన్‌తో పోల్చారు. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడిని ‘‘ఎప్పుడు జరగని లోతైన సరిహద్దు దాడి’’గా అభివర్ణించారు. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని భారత్ హతమార్చింది. దీనిని సెప్టెంబర్ 11, 2021లో జరిగిన అమెరికా దాడితో పోల్చారు. Read…
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత కీలకమైన శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోట లోని సతీష్ ధావాన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-9) రాడార్ శాటిలైట్‌ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం ఇది. 1,696 కిలోగ్రాముల EOS-9 రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలం నుండి 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉంచనున్నారు.
Rajnath Singh: భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ గురువారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” అనంతరం ఆయన చేపట్టిన తొలి పర్యటన ఇది. ఈ పర్యటనలో రక్షణ మంత్రి భారత సాయుధ దళాల సిద్ధతను సమీక్షించారు. పాక్ సరిహద్దుల్లో పడిన షెల్స్‌ను పరిశీలించారు. అనంతరం శ్రీనగర్ లోని ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి జవాన్లతో ముచ్చటించారు. Read Also: Royal…
Bob Blackman: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది పర్యాటకులే కావడం విషాదకరం. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత వహించింది. ఈ దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”ను బ్లాక్‌మన్ కొనియాడారు. Read Also: Kohli-Rohit: కోహ్లీ-రోహిత్ ముందే వీడ్కోలు పలికారా?..…
నిన్న ఆపరేషన్ సిందూర్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత, ప్రధాని మోడీ ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ ఈరోజు ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి బయలుదేరి పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ప్రధాని సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ వైమానిక దళ సిబ్బందిని కలిసి వారి మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్…
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ మరోసారి దాడులకు యత్నిస్తోంది. దీంతో ఉత్తరాదిన టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇండిగో, ఎయిర్ ఇండియా మే 13 నుంచి ఉత్తర, పశ్చిమ భారత్ లోని అనేక నగరాలకు విమాన సర్వీసులను నిలిపివేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్ సర్, లేహ్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు వెళ్లే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇది మీ ప్రయాణ ప్రణాళికలకు ఎలా అంతరాయం కలిగిస్తుందో మేము…
Balochistan: ఓ వైపు భారత్ దాడులతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. మరోవైపు, బెలూచిస్తాన్‌లో బలూచ్ లిజరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులకు పాకిస్తాన్ వణికిపోతోంది. పాక్ ఆర్మీని, పంజాబ్‌కి చెందిన వారిని బీఎల్ఏ వెతికి వేటాడి హతమారుస్తోంది. తాజాగా, బీఎల్ఏ తాము చేసిన దాడులను వెల్లడించింది. 51 ప్రాంతాల్లోని పాకిస్తాన్ సైన్యంపై 71 దాడులు చేశామని చెప్పింది. తాము ఏ దేశానికి కూడా ప్రాక్సీగా పనిచేయడం లేదని చెప్పింది. బీఎల్ఏ ఏ దేశానికి బంటు కాదని…
DRDO : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశ రక్షణ వ్యూహాల్లో హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కీలక భూమిక పోషిస్తోంది. దేశ భద్రతకు అవసరమైన అనేక ఆధునిక ఆయుధాల తయారీలో హైదరాబాద్ DRDO ల్యాబ్ నడిపిస్తున్న పరిజ్ఞానం ఇప్పుడు యుద్ధ సన్నాహాల్లో కీలకంగా మారింది. ఆకాష్, బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణుల నుంచి, సాంకేతికంగా ముందున్న యాంటీ డ్రోన్ సిస్టమ్ వరకు, అనేక ఆయుధ వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్…
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పైక్ పై ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది. మే 7న పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన అనేక మంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, సిబ్బందిని చూపించే వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత సాయుధ దళాలు అంత్యక్రియలకు హాజరైన పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కీలక పోలీసు…