కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ మరోసారి దాడులకు యత్నిస్తోంది. దీంతో ఉత్తరాదిన టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇండిగో, ఎయిర్ ఇండియా మే 13 నుంచి ఉత్తర, పశ్చిమ భారత్ లోని అనేక నగరాలకు విమాన సర్వీసులను నిలిపివేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్ సర్, లేహ్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు వెళ్లే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇది మీ ప్రయాణ ప్రణాళికలకు ఎలా అంతరాయం కలిగిస్తుందో మేము అర్థం చేసుకున్నాము. దీనివల్ల కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాము. అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read:Hair ఫాల్ Remedies: వెంట్రుకలు పొడిబారకుండా, ఊడిపోకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరి.!
జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. మేము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాము, మీకు తాజా సమాచారం అందిస్తాము” అని ఎయిర్‌లైన్ Xలో అప్‌డేట్‌ను పంచుకుంది. సోమవారం సాయంత్రం, అమృత్‌సర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం అమృత్‌సర్‌లో ముందుజాగ్రత్త బ్లాక్‌అవుట్ చర్యలు అమలు చేసిన తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చింది. సాంబా, అఖ్నూర్, జైసల్మేర్, కథువాలలో డ్రోన్లు కనిపించిన తర్వాత ఎయిర్‌లైన్స్ ఈ చర్యలు తీసుకున్నాయి.
Also Read:US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సోమవారం విమానాశ్రయాలను తిరిగి తెరిచినప్పటికీ, విమానయాన సంస్థలు జాగ్రత్తగా ముందుకు సాగాలని ఈ చర్యలు తీసుకున్నాయి. భారత వైమానిక రక్షణ వ్యవస్థలు సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్ డ్రోన్‌లను అడ్డుకున్నాయి. రాత్రి ఆకాశంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తక్కువ సంఖ్యలో డ్రోన్లు ఈ సెక్టార్‌లోకి ప్రవేశించాయని ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి.