Fake Student: ఐఐటీ బాంబేలో విద్యార్థిగా నటిస్తూ 14 రోజలు పాటు అక్రమంగా నివసించిన 22 ఏళ్ల వ్యక్తి బిలాల్ అహ్మద్‌ను అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. జూన్ 26న బిలాల్ సోఫాపై నిద్రిస్తున్నట్లు గమనించిన ఐఐటీ బాంబే ఉద్యోగి, ఎవరు అని ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా పారిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వారిద్దరూ వరుసకు బావా మరదళ్లు. అయినంత మాత్రాన వివాహేతర బంధం అంటగట్టారు. అంతే కాదు.. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్న తమ భాగస్వాముల నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కున్నారు. చిత్ర హింసలు అనుభవించారు. దీంతో జీవితం మీద విరక్తి చెంది కలిసే ఆత్మహత్య చేసుకున్నారు. బంధుత్వం, ప్రేమ, సమాజపు ఒత్తిళ్లు.. ఈ మూడింటి మధ్య ఊగిసలాడుతూ, ఇద్దరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.. ఈ ఘటన నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో కలకలం రేపింది..
వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 67 సంవత్సరాలు. ఆమె 1958లో ఈ రోజున జన్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు నాయకులు రాష్ట్రపతి ముర్ము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు ముర్ము ఉత్తరాఖండ్‌లో తన పుట్టినరోజును జరుపుకుంటారు. ఈ సమయంలో ఆమె ఇక్కడి ప్రజలకు ఒక ప్రత్యేక బహుమతిని కూడా ఇవ్వనున్నారు. రాజ్‌పూర్ రోడ్డులో నిర్మించిన రాష్ట్రపతి నికేతన్‌లో ఆమె తన పుట్టినరోజును జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆమె చాలా ఆధునిక…
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతిపై దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రియుడిని కొట్టి బంధించారు. సదరు విద్యార్థినిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని గోపాల్‌పూర్ బీచ్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రారంభంలో ఏడుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.
పిల్లలు అల్లరి చేయడం కామన్. ఎదిగే పిల్లలు అమ్మ ఒడిని దాటి బయటి పరిసరాల్ని అర్థం చేసుకునే సమయంలో ఇలాంటివి సహజమే. ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు. తమకు నచ్చింది తెచ్చివ్వాలని పట్టుదలకు పోతుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తాయి. కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఎంత అల్లరి చేసినా భరిస్తారు. కొంత మంది మాత్రం అస్సలు భరించలేరు. చిన్న పిల్లలపై దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తల్లి దారుణానికి…
Pink Coconut : వేసవి అంటేనే కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరాన్ని చల్లబరిచే ఈ సహజ పానీయం ప్రజల అభిమానంగా నిలుస్తుంది. అయితే తాజాగా మంగళూరులో ఓ వినూత్నమైన కొబ్బరి బొండాం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది సాధారణ రంగులో కాకుండా.. గులాబీ రంగులో ఉండే ఇండోనేషియన్ కొబ్బరి బొండాం అని సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. Daggubati Purandeswari: ఐదేళ్లు రాక్షస పాలన చూసాం..! ‘Manglore Information’…
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విధానసౌధ భద్రతా విభాగం డీసీపీ ఎం.ఎన్. కరిబసవనగౌడ రాసిన లేఖ బయటపడింది. అందులో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు తేలిసంది. జూన్ 4న, డీసీపీ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఒక సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. బక్రీద్ సందర్భంగా ఇస్ముహమ్మద్ అన్సారీ మేకలను వధించడానికి ఉపయోగించే భుజలి అనే ఆయుధంతో తన మెడను కోసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇస్ముహమ్మద్ సంచలన విషయాలు రాసుకొచ్చారు. నేను అల్లాహ్ దూత పేరు మీద నన్ను నేను బలి ఇస్తున్నానని పేర్కొన్నాడు. తనను…
ఈద్-ఉల్-అఝా(బక్రీద్) పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, అంకితభావం, అల్లాహ్‌పై అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈద్-ఉల్-అఝా పండుగ మనం కలిసి జీవించడానికి, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.