New Delhi : పొగాకు వ్యసనం నుంచి బయటపడేందుకు దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో ప్రత్యేక క్లినిక్‌లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం, న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) కూడా తన ఉత్తర్వును జారీ చేసింది,
Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాటపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.
Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వారందరినీ తన పరిధిలోకి తీసుకురావాలని, బీమా కవరేజీని ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఆలోచిస్తోంది.
Mumbai Accident : పూణె తరహాలో మరో కారు ప్రమాదం ముంబైలో వెలుగు చూసింది. ఈ ఉదయం ముంబైలోని వర్లీలో వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
Dalai Lama 89th Birthday: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 89వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.
Kerala : కేరళలో మరో చిన్నారికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ సోకింది. శనివారం పయోలి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన 14 ఏళ్ల చిన్నారికి జరిపిన టెస్టుల్లో ఇది తేలింది. కేరళలో ఇది నాలుగో కేసు. ముగ్గురు చిన్నారులు అప్పటికే చనిపోయారు.
Black Magic: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు, కన్నూర్ ఎంపి కె. సుధాకరన్ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Assam Flood: అసోంలో వరదల కారణంగా అక్కడ పరిస్థితి మరింత దిగజారుతోంది. గురువారం మరో ఆరుగురు మరణించారు. వీరిలో నలుగురు గోలాఘాట్‌కు చెందినవారు కాగా, ఒక్కొక్కరు దిబ్రూగఢ్, చరైడియో నుండి వచ్చారు.
Rahul Gandhi: లోక్‌సభలో సోమవారం విపక్ష నేత రాహుల్‌గాంధీ తన ప్రసంగంలో చేసిన పలు వ్యాఖ్యలు రికార్డుల నుండి తొలగించారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హిందువులు, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ గురించి వ్యాఖ్యానించడం గమనార్హం.
Vijay Mallya: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన రూ.180 కోట్ల రుణాన్ని ఎగవేసినందుకు విజయ్ మాల్యాపై ఉన్న కేసుకు సంబంధించి ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది.