పిల్లలు అల్లరి చేయడం కామన్. ఎదిగే పిల్లలు అమ్మ ఒడిని దాటి బయటి పరిసరాల్ని అర్థం చేసుకునే సమయంలో ఇలాంటివి సహజమే. ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు. తమకు నచ్చింది తెచ్చివ్వాలని పట్టుదలకు పోతుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తాయి. కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఎంత అల్లరి చేసినా భరిస్తారు. కొంత మంది మాత్రం అస్సలు భరించలేరు. చిన్న పిల్లలపై దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తల్లి దారుణానికి ఒడిగట్టింది.
READ MORE: Parenting Advice: పాఠశాలలు ప్రారంభం.. ఈ అంశాల్లో మీ పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే అంతే సంగతులు?
కర్ణాటకలోని ఓల్డ్ హుబ్బళీ టౌన్‌కు చెందిన అనుష హులిమర అనే మహిళ తన కుమారుడు అల్లరి చేస్తున్నాడని అతని ప్రవర్తనపై కోపంతో చేతులు, కాళ్లు, మెడపై ఇనుప కడ్డీతో వాతలు పెట్టింది. బాలుడి అరుపులు విన్న స్థానికులు పరుగు పరుగున ఇంట్లోకి ప్రవేశించారు. తల్లిని శాంతింపజేసి కుమారున్ని రక్షించారు. వాళ్లు వెంటనే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన తల్లిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన బాలల సంక్షేమ శాఖ అధికారులు.. బాధిత బాలుడికి వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు.. చిన్నారికి బాగా గాయాలు అయ్యాయి. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమ్మే నన్ను కాల్చింది అంటూ ఆ బాలుడు వీడియోలో చెప్పాడు.
READ MORE: Tammudu: ‘భూ భూతం..’ అంటున్న తమ్ముడు