ముంబైలోని ఒక ప్రముఖ పాఠశాలకు చెందిన 40 ఏళ్ల ఇంగ్లీష్ టీచర్ తన 16 ఏళ్ల విద్యార్థిపై ఏడాది పాటు లైంగిక వేధింపులకు పాల్పడింది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళ మైనర్ బాలుడిని ముంబైలోని వివిధ ఫైవ్ స్టార్ హోటళ్లు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి, మద్యం తాగించేదని తేలింది. నిరోధక మాత్రలు సైతం ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పేర్కొన్నాడు. 16 ఏళ్ల బాధితుడి ప్రవర్తనలో మార్పును గమనించిన కుటుంబీకులు ఆరా తీయగా.. ఈ విషయం బయటపడింది. జరిగిన విషయాన్ని ఆ బాలుడు కుటుంబీకులకు తెలియజేయడంతో వాళ్లు ఆ టీచర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో షాకింగ్ వివరాలు బయటకు వచ్చాయి.
READ MORE: Honor Magic V5: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6100mAh బ్యాటరీతో హానర్ మ్యాజిక్ V5 లాంచ్..!
పోలీసు ఫిర్యాదు ప్రకారం.. డిసెంబర్ 2023లో పాఠశాల వార్షికోత్సవం కోసం డ్యాన్స్ గ్రూపులకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెళ్లయి, పిల్లలు ఉన్న 40 ఏళ్ల మహిళా టీచర్ ఆ 16 ఏళ్ల అబ్బాయిని చూసింది. అతడి పట్ల ఆకర్షితురాలైంది. ఆమె ఒక నెల తర్వాత ఆ బాలుడిపై మొదటి సారి లైంగిక దాడికి పాల్పడింది. ఆ అబ్బాయి మొదట్లో అయిష్టంగానే టీచర్ నుంచి తప్పించుకోవడం మొదలుపెట్టాడు. అయితే, ఈ రోజుల్లో ఇవన్నీ సాధారణం అయ్యాయని చెప్పి ఓ మహిళా స్నేహితురాలు ఆ బాలుడిని ఒప్పించింది. దీంతో ఆ 16 ఏళ్ల విద్యార్థి ఒప్పుకున్నాడు. కాగా.. ఎలాగైనా ఆ బాలుడిని ఒప్పించి తన వద్దకు పంపించాలని టీచర్ ఆ మహిళా స్నేహితురాలిని ఉసిగొలిపింది. ఇలా చెప్పి ఒప్పించిన అబ్బాయి స్నేహితులిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
READ MORE: Icon: అదే కథ.. మరో స్టార్ హీరో!
బాలుడిని ఆమె తన కారులో ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా బట్టలు విప్పి లైంగికంగా వేధించింది. ఖరీదైన హోటళ్లకు తీసుకెళ్లడంతో ఆ విద్యార్థి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. టీచర్ తరచుగా బాలుడికి మద్యం తాగించి, అతనిపై దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ అబ్బాయి ఆందోళనకు గురైతే… ఆందోళన నిరోధక మందులు(యాంటీ యాంగ్జైటీ మందులు) కూడా ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందంతా తెలిసిన బాలుడి పేరెంట్స్ మొదట ఆమెను హెచ్చరించారు. అయినా వినిపించుకోకుండా రెండో సారి సైతం బాలుడిని సంప్రదించడంతో విషయం బయటకు వచ్చింది.