Tragedy : ఉత్తర ప్రదేశ్‌లోని నగ్లాస్వామి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికై యమునా నదిని సందర్శించిన ఆరుగురు యువతులు మృత్యువాత పడ్డారు. ఒక్క కుటుంబానికి చెందిన ఈ ఆరుగురు యువతులు అందమైన దృశ్యాలను క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో నదిలోకి దిగారు. అయితే, ప్రమాదవశాత్తూ ఒక యువతి నీటిలో మునిగిపోవడం చూసిన మిగతా ఐదుగురు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారంతా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. GHMC : జీహెచ్‌ఎంసీ బార్లకు…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
హర్యానాలోని పంచకులాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ మిట్టల్ అనే వ్యాపారవేత్త తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య, తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు సంచలన విషయాలు రాసుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పరిధి బితూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రతన్ ప్లానెట్ అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. ఈ చిన్న వివాదం భయంకరమైన మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో.. ఓ యువకుడు అపార్ట్‌మెంట్ కార్యదర్శి, రిటైర్డ్ ఇంజనీర్ ముక్కు కొరికాడు. ఈ వార్త ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతోంది. అతడే తన భర్త అని చెబుతోంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. మైనర్ వయస్సు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇంత భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా తరలి వచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమం జరిగింది. వర్షం కుస్తున్నప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. కరీంనగర్ లో ఏక్తా యాత్ర ప్రారంభిస్తే నన్ను హిందూ పిచ్చోడని హేళన చేశారన్నారు. ఏక్తా యాత్ర రోజే పోటీ యాత్రలు పెట్టి విచ్చిన్నం చేయాలని చూశారన్నారు. తరలివచ్చిన ఈ జనాన్ని చూస్తుంటే ఎందాకైనా పోరాడాలన్పిస్తోందన్నారు. గతంలో ఇదే హిందూ ఏక్తా యాత్ర…
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే నెలలో వచ్చిన ఈ అకాల వర్షం చాలా మందిని గందరగోళానికి గురి చేసింది. ముందుగా అనుకున్న కార్యక్రమాలు నిలిచిపోయాయి. పూణేలో కొన్ని వివాహాల్లో జాప్యం చోటు చేసుకుంది. కానీ, ఈ కుండపోత వర్షం కారణంగా ఒక సానుకూల విషయం జరిగింది. వనవాడిలో జరిగిన ఒక వివాహ వేడుక మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపించింది. వర్షం కారణంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి వేరే మతానికి…
మనుషులు కూడా అప్పుడప్పుడు జంతువుల తెలివితేటలను కళ్లకు కట్టినట్లు చూస్తారు. అవి చేసే పనులకు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక కొన్ని జంతువులు అయితే ఊహకందని విధంగా తెలివితేటలకు ప్రదర్శిస్తాయి. కొన్ని జంతువులు ప్రమాదాలను ముందే గుర్తిస్తాయి. పైగా జంతువుల్లోని కమ్యూనికేషన్ ను చూస్తే తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇలాంటి తెలివిగల అరుదైన జంతువులు చాలానే ఉన్నాయి.
పాకిస్థాన్‌కు స్పై ఏజెంట్‌గా పని చేస్తూ దొరికిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నిజం ఒప్పుకుంది. తాను పాకిస్థాన్ గూఢచారిని అని ఆమె అంగీకరించింది. విచారణ అధికారులు ఎదుట నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పని చేసినట్లు జ్యోతి తెలిపినట్లు తెలుస్తోంది. ఐఎస్ఐ అధికారులను పలు మార్లు కలవడంతో పాటు వాళ్లు అడిగిన సమాచారన్ని చేరవేసినట్లుగా విచారణ సమయంలో ఆమె అంగీకరించింది. దీని కోసం ఐఎస్ఐ ఏజెంట్లతో రహస్యంగా చాట్ చేసినట్లు…
27 ఏళ్ల నాటి కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మరికొందరు తారలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ కేసుపై తాజాగా కీలక అప్డెట్ వచ్చింది. ఈ తారలకు సంబంధించిన అప్పీళ్లను విచారణకు జాబితా చేయాలని రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లతో పాటు సోనాలి బింద్రే, నీలం, టబు పేర్లు కూడా కృష్ణ జింకల వేట కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ…