Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి సూపర్ ఫోర్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “మేము ఉత్తమంగా ఏమి చేయగలమో దానిపై దృష్టి పెడుతున్నాం. గత రెండు మూడు మ్యాచ్‌లలో మేము అనుసరిస్తున్న మంచి అలవాట్లన్నింటినీ పాటించాలని…
ఈ ఏడాది చివరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం కష్టమే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన రోహిత్.. ఈ సిరీస్‌లో పాల్గొనకూడదని అతను నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. బీజీటీలో ఫెయిల్ అయిన కోహ్లీ మాత్రం ఆడనున్నట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ కు సిద్ధమవుతుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాలో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకుంది. టీ20 సిరీస్‌లో అద్భుతంగా ప్రదర్శించిన 'మిస్టరీ స్పిన్నర్' వరుణ్ చక్రవర్తి.. భారత వన్డే జట్టులో చేరాడు.
2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాక్ నుంచి తరలించే అవకాశం ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను నిర్ణయించేందుకు వర్చువల్ సమావేశానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు ఏర్పాటుకు ఒక రోజు ముందు ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Rahul Dravid: టీ 20 ప్రపంచకప్‌ని టీమిండియా గెలుచుకోవడంపై ఫ్యాన్ ఆనందంగా ఉన్నారు. అయితే, ఈ విజయం వెనక కోచ్ రాహుల్ ద్రావిడ్ ఘనతను కూడా కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే, త్వరలో కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ దిగిపోనున్నారు. టీమిండియాకు కొత్త కోచ్ బాధ్యతలని గౌతమ్ గంభీర్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
BCCI : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు బీసీసీఐ ఇండియా జట్టును ప్రకటించింది. ఢిల్లీ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించిన తర్వాత బీసీసీఐ ఈ ప్రకటన చేసింది.