ఈ ఏడాది చివరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం కష్టమే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన రోహిత్.. ఈ సిరీస్‌లో పాల్గొనకూడదని అతను నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. బీజీటీలో ఫెయిల్ అయిన కోహ్లీ మాత్రం ఆడనున్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ, రోహిత్ అనుకున్నంత ప్రదర్శన కనబరచలేకపోయారు. ఈ క్రమంలో.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడలేదు.
Read Also: JR NTR : త్రిబుల్ ఆర్ చూసి తెలుగు నేర్చుకున్న ఎన్టీఆర్ జపాన్ అభిమాని..
ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో పెర్త్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌లో కూడా రోహిత్ పాల్గొనలేదు. అడిలైడ్ ఓవల్‌లో జరిగిన డే-నైట్ టెస్టులో ఆడినప్పటికీ.. రోహిత్ శర్మ తన ఫామ్‌ను తిరిగి పొందలేకపోయారు. మూడు మ్యాచ్‌లలో అతను 6.20 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యారు. కాగా.. సిడ్నీ టెస్ట్ నుంచి పక్కకు తప్పుకోవడంతో రిటైర్మెంట్ తీసుకుంటున్నాడనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో.. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చే ఉద్దేశ్యం తనకు లేదని రోహిత్ చెప్పాడు . “ఇది రిటైర్మెంట్ నిర్ణయం కాదు. నేను టెస్టుల నుండి వైదొలగడం లేదు. నేను బ్యాట్‌తో పరుగులు సాధించలేకపోయాను. కాబట్టి ఈ ఆట నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను,” అని రోహిత్ చెప్పారు. “2 నెలలు లేదా 5 నెలల తర్వాత నేను పరుగులు సాధిస్తాననే గ్యారంటీ లేదు” అని ఆయన తన అనుభవాన్ని వెల్లడించారు.
Read Also: Ambati Rayudu: ఐపీఎల్లో అతనే నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్
మరోవైపు.. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో ఆడినప్పటికీ.. పెద్ద స్కోరు సాధించలేకపోయాడు. కాగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించడానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కీలకపాత్ర పోషించారు. ఫైనల్‌లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ (76) ప్రదర్శన కనబరచగా.. విరాట్ కోహ్లీ పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై వరుసగా 100 నాటౌట్, 84 పరుగులు చేశాడు. కాగా.. టీమిండియా ఈ ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది. తదుపరి నాలుగు టెస్ట్‌లు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి.