Bihar: ఓ వైపు లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అధికార, విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీని గద్దె దించాలని భావిస్తున్న బీహార్‌లోని ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్ తగిలింది. ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల ‘మహాగటబంధన్’ కూటమికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పార్టీల ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధికార బీజేపీలో చేరారు.
Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడంతో ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ రోజు జోడో యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా మీదుగా సాగుతున్న యాత్రలో అఖిలేష్ యాదవ్ చేరారు. రెండు…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన వారణాసి పర్యటనలో పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. వారణాసి ప్రజలు ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. ఉత్తర ప్రదేశ్ ప్రజల్ని అవమానించినందుకు ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్నవారిని తాను చూశానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ శుక్రవారం మండిపడ్డారు.
ఇండియా కూటమిలో (INDIA Bloc) బహుజన్ సమాజ్ పార్టీ చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) కొట్టిపారేశారు. అలాంటి వదంతులను నమ్మొద్దని కార్యకర్తలకు సూచించారు.
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి (India Bloc) దెబ్బ మీద దెబ్బలు తగలుతున్నాయి. ఇప్పటికే కూటమిలోని పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా సొంత నిర్ణయాలతో ముందుకు పోతున్నాయి.
INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉంటామని భావించి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విబేధాలు కనిపిస్తున్నాయి. టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు ఇప్పటికే తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. సీట్ల షేరింగ్‌లో కాంగ్రెస్ వైఖరిని నిందించాయి. మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకేసి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 40 స్థానాలైనా గెలుచుకుంటుందా.? అనే అనుమానాన్ని వ్యక్తం చేశాయి. మరోవైపు ఆప్ పంజాబ్, ఢిల్లీల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై పెద్దగా స్పందించడం లేదు.
INDIA bloc: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తుల పంచాయతీ కొలిక్కి రావడం లేదు. సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల మధ్య వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే ప్రతిపక్ష ఇండియా కూటమిలో విబేధాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇటీవల బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇవ్వమని స్పష్టంగా చెప్పింది. మరోవైపు ఆప్ కూడా అదే దారిలో వెళ్తోంది.