Bharat Jodo Nyay Yatra: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రెండో రోజు ఇండియా కూటమి బలప్రదర్శన నిర్వహించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ఈ రోజు ముంబైలో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. 63 రోజుల పాటు జరిగిన ఈ యాత్ర ముగింపు వేడుకలు ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్,…
Omar Abdullah: ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత విమర్శలు ప్రతిపక్షాలకే ఎదురుదెబ్బగా మారుతున్నాయని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. భారతదేశం పేదగా మారితే, బీజేపీ ధనవంతమైందని ఆరోపించారు. శనివారం ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2024లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై వ్యతిగత దాడికి దిగిన ప్రతీసారి అది బూమరాంగ్ అవుతోందని అన్నారు.
ఎన్డీయే కూటమి 400 లోక్ సభ స్థానాలను దక్కిచించుకుంటామనే నినాదం భారతీయ జనతా పార్టీకి మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమి 400కు పైగా సీట్లు గెలుచుకోవచ్చని తాజా సర్వేలో తేలింది.
Rahul Gandhi: తాము అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాలను రక్షిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌తో కలిసి గురువారం మహారాష్ట్రలోని నాసిక్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా 'కిసాన్ మహాపంచాయత్'లో ప్రసంగించారు. నాసిక్ ఉల్లి, ద్రాక్ష, టొమాటోల సాగుకు ప్రసిద్ధి. మహాపంచాయత్ సభ సందర్భంగా రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు.
BJP: 2024 లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ వ్యూహాలు రూపొందిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాలను క్రాస్ చేస్తుందని ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. ఢిల్లీలో ఆప్‌తో బీజేపీ పోటీ పడబోతోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో అభ్యర్థుల విషయంలో బీజేపీ కీలకంగా…
Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని 42 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. దీదీ ప్రకటనలో బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని స్పష్టంగా చెప్పింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తున్నాయి. బెంగాల్‌లో ఒంటరి పోరుకే మమత మొగ్గు చూపారు.
BJP: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే తాజాగా వెల్లడించింది. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లకు చేరువకు వస్తుందని అంచనా వేసింది. సర్వే ప్రకారం.. ఎన్డీయేకి 358-398 మధ్య సీట్లు వస్తాయని, ఇందులో బీజేపీకి స్వతహాగా 333-363 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పింది.
Bharat Jodo Nyay Yatra: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమి బలాన్ని చూపేందుకు కాంగ్రెస్ మరోసారి భారీ కార్యక్రమానికి తెరతీసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ మార్చి 17న ముంబైలో ముగియనుంది. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతల్ని మల్లికార్జున ఖర్గే ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్నికల మోడ్‌లో ఉందని, దూకుడుగా ప్రచారం చేస్తామని అన్నారు.
Congress: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ కీలక సమావేశం జరగబోతోంది. ఇప్పటికే బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేయడానికి సమావేశం కాబోతోంది. చత్తీస్‌గఢ్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల అభ్యర్థులపై చర్చించనున్నారు. ఈ రాష్ట్రాల్లో 60 సీట్లపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
BJP: ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశానికి ఆ పార్టీ నేతలంతా సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు కాసేపట్లో బీజేపీ అత్యున్నత సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరుకాబోతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల కమీషన్ లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందే బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో తలమునకలైన…