Nani Jokes With Constables at Independence Day 2024 Event: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న వారితో ‘నేచురల్ స్టార్’ నాని ముచ్చటించారు. ట్రైనీ కానిస్టేబుళ్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ ‘పిల్ల జమిందార్’ సినిమాను గుర్తుచేయగా.. నాని సరదాగా నవ్వుకున్నారు. అంతేకాదు ‘మీకు ఉప్మాలో జీడిపప్పు వస్తుందా?’ అని జోకులు పేల్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Nani about Jersey Movie: ‘జెర్సీ’ తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రం అని నేచురల్ స్టార్ నాని తెలిపారు. తన శైలికి పూర్తి భిన్నమైన సినిమా అని, ఎప్పుడో గానీ అలాంటి కథలు రావన్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ వస్తూ పోతుంటాయని.. ప్రశంసలే ఎప్పటికీ తరగని ఆస్తి అని పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరం యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న వారితో నాని ప్రత్యేకంగా ముచ్చటించారు. ట్రైనీ కానిస్టేబుళ్లు అడిగిన పలు ప్రశ్నలకు…
స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగం చేసి తన రికార్డును తానే అధిగమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు 98 నిమిషాల పాటు తన సుదీర్ఘమైన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంతో 2016లో 96 నిమిషాల తన మునుపటి రికార్డును అధిగమించారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో వరుసగా 11వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌లో ఇటీవలి రాజకీయ అశాంతి సమయంలో దాడులను ఎదుర్కొన్న హిందువుల భద్రత గురించి 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని, రాష్ట్రాలు మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని అన్నారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని విన్నారు. గతంలో ఆ పదవి ఖాళీగా ఉండడంతో ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడం ఇదే తొలిసారి.
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు.
దేశం ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది ప్రధాని మోడీ చారిత్రాత్మక మూడో టర్మ్‌లో మొదటి ప్రసంగం కావడం విశేషం.ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఇది వరుసగా 11వ సంవత్సరం.
Har Ghar Tiranga Certificate 2024: భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారం ఆగస్టు 9న ప్రారంభమైంది. ఇది ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రారంభించబడిన ఈ కార్యక్రమం విస్తృతంగా పాల్గొనడం ద్వారా జాతీయ ఐక్యతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ప్రచారంలో చెప్పుకోదగ్గ హైలైట్ ‘తిరంగా బైక్ ర్యాలీ’ ఆగస్టు 13న ఢిల్లీలో జరగనుంది. ర్యాలీలో పార్లమెంటు సభ్యులు…