Nani: నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రం అదే: నాని
- కానిస్టేబుళ్లతో నాని ముచ్చట్లు
- కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా జెర్సీ
- ప్రశంసలే ఎప్పటికీ తరగని ఆస్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani about Jersey Movie: ‘జెర్సీ’ తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రం అని నేచురల్ స్టార్ నాని తెలిపారు. తన శైలికి పూర్తి భిన్నమైన సినిమా అని, ఎప్పుడో గానీ అలాంటి కథలు రావన్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ వస్తూ పోతుంటాయని.. ప్రశంసలే ఎప్పటికీ తరగని ఆస్తి అని పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరం యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న వారితో నాని ప్రత్యేకంగా ముచ్చటించారు. ట్రైనీ కానిస్టేబుళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
జెర్సీ చిత్రంలో నటించడం ఎలా అనిపించింది అని రామకృష్ణ అనే ట్రైనీ కానిస్టేబుళ్ అడగగా… ‘జెర్సీ నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. ఎప్పుడూ హిట్ సినిమాకు మించిన చిత్రంను తీయడానికి ప్రయత్నించాలి. నా శైలికి పూర్తి భిన్నమైన సినిమా జెర్సీ. ఎప్పుడో గానీ అలాంటి కథలు రావు. గొప్ప కథ, మ్యూజిక్, టేకింగ్ అన్ని కుదిరాయి. ప్రతి వ్యక్తి తనకు అనుకున్న విజయం దక్కిన తర్వాత జెర్సీలోని రైల్వేస్టేషన్ సీన్‌ను గుర్తు చేసుకుంటూ పోస్ట్‌లు పెట్టడం ఆనందంగా ఉంది. కొంచెం బాధలో ఉన్నపుడు జెర్సీ సినిమా చూస్తామని నాతో చాలామంది చెప్పారు. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి వస్తూ పోతుంటాయి కానీ ఇలాంటి ప్రశంసలే ఎప్పటికీ తరగని ఆస్తి’ అని నాని చెప్పుకొచ్చారు.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
నాని తాజాగా నటించిన సినిమా ‘సరిపోదా శనివారం’. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. డైరెక్టర్ ఎస్‍జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. డివీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!