ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 లో ఓ హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా , పాకిస్థాన్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ ఇప్పటికే 12 మంది ఆటగాళ్లతో కూడిన తమ జట్టును ప్రకటించింది. కానీ భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఇక ఈ మ్యాచ్ పై అలాగే పాక్ జట్టుపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… పాకిస్థాన్ జట్టు చాలా అద్భుతంగా ఉంది అని అన్నారు. అలాగే…
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే ఆ జోషే వేరు. అయితే ఈ మ్యాచ్ పై విపరీతమైన బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో ఆడిన అన్ని మ్యాచ్ లలో భారత్ విజయకేతనం ఎగరవేసింది. దాని ఆధారంగానే ఇప్పుడు ఆన్లైన్ లో జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో పాక్ జట్టు పై భారీగా అంచనాలు పెంచుతున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కానీ ఇందులో విజయం…
ఇండియా పాక్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. ఇక క్రికెట్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంది. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లలో ఇండియాపై పాక్ ఎప్పడూ గెలవలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్రను సృష్టించాలని పాక్ చూస్తున్నది. అయితే, ప్రపంచంలో ఇండియా జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్టుగా ఎదిగింది.…
టి 20 మ్యాచ్ లు ఎక్కడ జరగినా క్రీడా ప్రేమికులు అత్యధిక సంఖ్యలో చూస్తుంటారు. ఇక, ఇండియా పాక్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా టీవీ ఛానళ్లలోనూ చూస్తుంటారు. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లలో పాక్ ఇండియాను ఓడించలేదు. ఐదుసార్లు రెండు జట్లు తలపడగా ఐదుసార్లు ఇండియానే విజయం సాధించింది. దీంతో ఈసారి ఎలాగైన చరిత్రను తిరగరాయాలని పాక్ అనుకుంటోంది. దీనికోసం పెద్ద ఎత్తున…
భారత పేసర్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ అని.. అతడిని పాకిస్థాన్ యువ బౌలర్ షాహీన్ అఫ్రిదితో పోల్చడం అవివేకమని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ పేర్కొన్నాడు. అయితే అఫ్రిది మరియు బుమ్రా ఇద్దరూ తమ జట్లలో కీలకమైన బౌలర్లు. కానీ ఇంకా షాహీన్ చిన్నవాడు కనుక తనను ఇప్పుడే బుమ్రాతో పోల్చడం అవివేకం. షాహీన్ ఇంకా నేర్చుకుంటున్నాడు. కానీ బుమ్రా కొంతకాలంగా భారత జట్టు తరపున దఃబుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అతను ప్రస్తుతం…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపు భారత్ – ఫకిస్ర్త జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్తాన్ మాజీ టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ యూనిస్ ఖాన్ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో పాకిస్త జట్టుకు రోహిత్ శర్మ, బుమ్రా ల కారణంగా ముప్పు ఉందని అన్నారు. అయితే రెండు జట్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు మహ్మద్ రిజ్వాన్ తమ తమ జట్లకు “మ్యాచ్ విన్నర్లు”…
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ కు ఏ మ్యాచ్ కు ఉండని ప్రజాదరణ ఉంటుంది. అయితే ఈ రెండు జట్లు దేశాల మధ్య ఉన్న సమస్యల కారణంగా ద్వైపాక్షిక సిరీస్ లలో ఆడటం లేదు. అయితే రేపు ఈ రెండు జట్లు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పై బీసీసీఐ బాస్ గంగూలీ మాట్లాడుతూ… భారత్ – పాక్ మ్యాచ్ ను ఇండియాలో నిర్వహించలేము. ఎందుకంటే ఈ మ్యాచ్ కు…
ఏ జట్ల మధ్య మ్యాచ్ కోసం… యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తుందో… ఆ క్షణం వచ్చేసింది. దాయాదుల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే.. ఆ రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే ఆసక్తి చూపుతారు. కానీ… ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంటే… క్రికెట్ రుచి తెలియని దేశాలు సైతం టీవీలకు అతుక్కుపోయి చూస్తాయి. మిగతా దేశాలతో మ్యాచ్ ఆడితే గెలుపోటములను సమానంగా స్వీకరిస్తారు. కానీ.. దాయాది…
క్రికెట్ ఫ్యాన్స్ కి డబుల్ దమాకా మ్యాచ్. బెట్టింగ్ రాయుళ్లకు కోట్లు కురిపించే మ్యాచ్. నువ్వా నేనా అనే ఫైట్ ఈసారి వరల్డ్ కప్లో మొదటి మ్యాచే కావడంతో… సూపర్ సండే ఫైట్ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్లో దంచికొట్టిన టీం కోహ్లీ… దయాది తో జరిగే మ్యాచ్ కోసం సయ్యంటోంది. క్రికెట్ లవర్స్ ఈ మ్యాచ్ కోసం ఎదరుచూస్తుంటే… మరోవైపు దాయాది పాకిస్తాన్ను వ్యతిరేకించే వర్గాలు మాత్రం.. ఈ మ్యాచ్ని బహిష్కరించాలని డిమాండ్…
భారత్ ఎప్పుడూ తన గొప్పలు చెప్పుకోదని అన్నాడు మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్. ఈ సారి చరిత్ర సృష్టించబోతున్నామని పాకిస్థాన్కి చెందిన ఓ యాంకర్ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్ ఘాటుగా బదులిచ్చాడు. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో భారత్తో మ్యాచ్ ఉంటే.. పాకిస్థాన్ జట్టు ఈ సారి కచ్చితంగా చరిత్ర సృష్టిస్తామని గొప్పలు చెబుతూ కాలం వెల్లదీస్తుందని విమర్శించాడు. కానీ, టీమిండియా ఆటగాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్రాక్టీసులో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నాడు. ఆ కారణంగానే…