Imran Nazir: ఓడిపోతామనే భయంతోనే రావట్లేదు.. నిప్పులు చెరిగిన ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Fans Fire On Imran Nazir For Controversial Comments: ఆసియా కప్ వేదిక వ్యవహారంపై భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య వాగ్వాదం చెలరేగిన విషయం తెలిసిందే! పాక్‌లో టోర్నీ నిర్వహిస్తే ఆ గడ్డపై భారత్ కాలు మోపదని బీసీసీఐ కార్యదర్శి జై షా వ్యాఖ్యానించగా.. తాము కూడా వరల్డ్ కప్ ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టమంటూ పాక్ బోర్డు తిరుగు సమాధానం ఇచ్చింది. ఇప్పటికీ ఈ విషయంపై ఇరు దేశాల మాజీలు, ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు గాను ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ పాక్‌లోనే నిర్వహించేందుకు అంగీకరించిన ఐసీసీ.. భారత్‌కి సంబంధించిన మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించేలా ప్రణాళికలు రచించినట్టు తెలిసింది.
Mallikarjun Kharge: ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య.. రాహుల్ కోసం పోరాడుతాం..
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నాజిర్ టీమిండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ గడ్డపై ఓడిపోతామనే భయంతోనే వాళ్లు ఇక్కడికి రావడం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. ‘‘భద్రతా కారణాలనేవి కేవలం ఒక సాకు మాత్రమే. పాకిస్తాన్‌కి ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లు కూడా వచ్చాయి. కానీ టీమిండియా మాత్రం పాక్‌కు రావడానికి సాకులు వెదుకుతోంది. పాకిస్తాన్ గడ్డపై ఓడిపోతామనే భయంతోనే.. వాళ్లు ఇక్కడికి రావడం లేదు. దమ్ముంటే పాకిస్తాన్‌కి వచ్చి క్రికెట్ ఆడండి. అప్పుడే ఎవరి సత్తా ఏంటో అన్నీ తెలుస్తాయి’’ అంటూ ఇమ్రాన్ చెప్పుకొచ్చాడు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే సాధారణంగానే అంచనాలు ఏర్పడుతాయని, కానీ భారత జట్టుకి ఓటమిని తట్టుకునే శక్తి ఉండదని, అందుకే భద్రతా కారణాల్ని చూపిస్తూ ఇక్కడికి రాలేమంటూ సాకులు చెప్తున్నారని పేర్కొన్నాడు.
Manchu Vishnu: మనోజ్ తో గొడవ.. ఎట్టకేలకు స్పందించిన మంచు విష్ణు
ఈ విధంగా ఇమ్రాన్ వ్యాఖ్యానించడంతో.. అతనిపై ఇండియన్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పాక్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసని.. గతంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు అప్పటికప్పుడే తమ సిరీస్‌లు రద్దు చేసుకున్నారని.. ఆ విషయం గుర్తు లేదా? అంటూ ధ్వజమెత్తారు. ఎంతో పటిష్టమైన టీమిండియా లాంటి జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ముందు.. ఆలోచించుకుంటే మంచిదని హెచ్చరించారు. భారత్‌ని ఓడించేంత స్థాయి పాక్‌కి లేదని, ముందు మీ స్థాయి ఏంటో మర్చిపోవద్దంటూ కౌంటర్లు వేశారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!