History of India vs Pakistan in ODI World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్న మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభిస్తుంది. ఇక ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల సమరం అక్టోబర్ 15న జరగనుంది. భారత్, పాకిస్తాన్ జట్లు ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి.
ప్రపంచకప్ 2023 కోసం పాకిస్తాన్ జట్టు ఏడేళ్ల విరామం తర్వాత భారత్‌లో అడుగుపెట్టనుంది. పాక్ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్ కోసం భారత్ వచ్చింది. ప్రపంచకప్ 2023 కోసం ఏడేళ్ల తర్వాత భారత్‌కు రానుంది. ఇరు దేశాల మధ్య బేధాభిప్రాయాల కారణంగా గత కొంత కాలంగా ఇండో-పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు కూడా జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే తలపడుతున్నాయి. ఇక వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం ఎక్కువ. ఆ రికార్డ్స్ ఇప్పుడు చూద్దాం.
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్లు ఏడు సార్లు తలపడ్డాయి. 1992, 1996, 1999, 2003, 2011, 2015 మరియు 2019లో జరిగిన ఏడు మ్యాచులలో భారత్ గెలిచింది. 2007లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఇండో-పాక్ టీమ్స్ గ్రూప్ రౌండ్ నుంచే ఇంటిదారి పట్టాయి. దాంతో తలపడే అవకాశం రాలేదు. ఇక 2023లో కూడా తన హవా కంటిన్యూ చేయాలని భారత్ చూస్తోంది.
భారత్-పాకిస్తాన్ రికార్డ్స్ (India vs Pakistan ODI World Cup Records):
# 1992లో పాకిస్తాన్‌తో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 49 ఓవర్లలో 216 పరుగులు చేసింది. పాక్ 173 పరుగులకు ఆలౌటైంది.
# 1996లో బెంగుళూరులో జరిగిన మ్యాచ్‌లో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. నవజోత్ సిద్ధూ 115 బంతుల్లో 93 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
# 1999లో మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో గెలిచింది. వెంకటేష్ ప్రసాద్ 5 వికెట్స్ తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
# 2003లో సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సచిన్ టెండూల్కర్ 75 బంతుల్లో 98 పరుగులు చేశాడు.
# 2011లో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో గెలిచింది. 85 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
# 2015లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో భారత్ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.
# 2019లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో గెలుపొందింది. రోహిత్ శర్మ 140 పరుగులు చేశాడు.
Also Read: Virat Kohli Out: ఉనాద్కత్ బౌలింగ్‌లో కోహ్లీ ఔట్.. వీడియో వైరల్!
Also Read: Oppo Reno 10 5G Price: లీకైన ఒప్పో రెనో 10 5జీ ధర.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు!