Toshakhana case: తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలింది. కోర్టు అతనికి మూడేళ్ల శిక్ష విధించింది. శిక్ష పడిన తర్వాత ఇమ్రాన్ వచ్చే ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు.
ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీల అక్రమ వివాహంపై కేసును కోర్టులో విచారణకు అర్హమైనదిగా పేర్కొంది. జూలై 20న వారిద్దరు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ బుట్టో సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, వీరి వ్యాఖ్యలపై ఇమ్రాన్ స్పందిస్తూ ‘‘వాళ్లు మా పార్టీని రద్దు చేస్తే చేయనీయండి. కొత్త పార్టీ పేరు మీద గెలుస్తాం అని అన్నారు. పోటీ చేయకుండా నాపై నిషేధం విధించినా, నన్ను జైల్లో వేసినా, మా పార్టీ గెలుస్తుందని ఇమ్రాన్ తెలిపారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వందకు పైగా కేసుల్లో ఇరుక్కోవడం తెలిసిన విషయమే. కొన్ని రోజుల క్రితం ఆయన అరెస్ట్ తర్వాత ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు పాల్పడ్డారు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత మే 9 హింసాత్మక నిరసనల సందర్భంగా సైనిక స్థావరాలను రక్షించడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ సైన్యం లెఫ్టినెంట్ జనరల్‌తో సహా ముగ్గురు అధికారులను తొలగించింది.
మే 9 హింసాకాండ తర్వాత పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగిన తరువాత బహిష్కరించబడిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొత్తం పార్టీ రిక్షాలో సరిపోతుందని అధికార పీఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ అన్నారు.
White House: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇప్పటికి మొత్తం మూడు అమెరికన్ నగరాలను సందర్శించారు. రాహుల్ వైట్‌హౌస్‌ను సందర్శించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
Pakistan:ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో పాకిస్తాన్ సతమతం అవుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలు అధిక ధరలు, కొందాం అనుకున్నా నిత్యవసరాలు అందుబాటులో ఉండటం లేదు. దీనికి తోడు కరెంట్, ఇంధన సమస్యలతో పాక్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సవాల్ చేస్తున్నారు.