Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వందకు పైగా కేసుల్లో ఇరుక్కోవడం తెలిసిన విషయమే. కొన్ని రోజుల క్రితం ఆయన అరెస్ట్ తర్వాత ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు పాల్పడ్డారు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత మే 9 హింసాత్మక నిరసనల సందర్భంగా సైనిక స్థావరాలను రక్షించడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ సైన్యం లెఫ్టినెంట్ జనరల్‌తో సహా ముగ్గురు అధికారులను తొలగించింది.
మే 9 హింసాకాండ తర్వాత పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగిన తరువాత బహిష్కరించబడిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొత్తం పార్టీ రిక్షాలో సరిపోతుందని అధికార పీఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ అన్నారు.
White House: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇప్పటికి మొత్తం మూడు అమెరికన్ నగరాలను సందర్శించారు. రాహుల్ వైట్‌హౌస్‌ను సందర్శించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
Pakistan:ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో పాకిస్తాన్ సతమతం అవుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలు అధిక ధరలు, కొందాం అనుకున్నా నిత్యవసరాలు అందుబాటులో ఉండటం లేదు. దీనికి తోడు కరెంట్, ఇంధన సమస్యలతో పాక్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సవాల్ చేస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం కలవరపెడుతోంది. ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చర్యలు చేపడుతుండటం, దీనికి ప్రజా మద్దతు ఉండటంతో అక్కడి ప్రభుత్వం, సైన్యం, ఐఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ ను, అతని పార్టీ పీటీఐని దెబ్బతీయాలని చూస్తున్నాయి.
మే 9న లాహోర్‌లోని చారిత్రాత్మక కార్ప్స్ కమాండర్ హౌస్ లేదా జిన్నా హౌస్‌పై జరిగిన హింసాత్మక దాడిపై దర్యాప్తు చేస్తున్న సంయుక్త దర్యాప్తు బృందం మంగళవారం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పిలిపించింది.
కొత్తగా నియమితులైన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రధాన కార్యదర్శి ఒమర్ అయూబ్ ఖాన్ ఆదివారం ఇస్లామాబాద్ పోలీసులు తన ఇంటిపై దాడి చేసి తన వాహనాన్ని దొంగిలించారని ఆరోపించారు. దొంగలను పట్టుకోవడానికి దొంగలను ఎలా పిలవాలి అని ఎద్దేవా చేశారు.
Imran Khan: అవినీతి ఆరోపణలతో ఈ నెల మొదట్లో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొకైన్ డ్రగ్ వాడినట్లు వెల్లడైంది. పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదుగురు వైద్యుల ప్యానెల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించారు.