Pakistan: సంక్షోభ పాకిస్తాన్‌లో ఎన్నికల నగారా.. వచ్చే జనవరిలో ఎలక్షన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆర్థిక, రాజకీయ అస్థిరతతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ లో 2024 జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. నియోజకవర్గాల విభజనను సమీక్షించింది, సెప్టెంబర్ 27న తొలి జాబితా విడుదల చేసేందుకు పాక్ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుందని అక్కడి డాన్ న్యూస్ వెల్లడించింది. ఎన్నికల సంఘం ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు, తదుపరి వాదనలు విన్న తర్వాత, నవంబర్ 30న తుది జాబితాను విడుదల చేయనుంది. 54 రోజుల పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తరువాత 2024 జనవరి చివరి వారంలో ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఆగస్టు 9న ముందస్తుగా రద్దు చేయబడింది. పదవీ కాలం ముగియడానికి కొద్ది రోజుల ముందు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రకటించింది. సాధారణంగా జాతీయ అసెంబ్లీ రద్దైన తర్వాత 90 రోజల్లో ఎన్నికలు జరగాలి. అయితే గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. పాకిస్తాన్ లోని అన్ని జాతీయ పార్టీలు డీలిమిటేషన్ కాల పరిమితిని తగ్గించాలని పాక్ ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ ప్రక్రియకు కనీసం నాలుగు నెలల సమయం పట్టనుంది.
Also Read
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
Read Also: Anitha : బికినిలో థండర్ థైస్ తో రచ్చ చేస్తున్న అనిత.. ఇలా చూపిస్తే ఎలా పాప..
ప్రస్తుతం పాకిస్తాన్ లో అన్వర్ ఉల్ కాకర్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎన్నికల ఖర్చును కూడా భరించే పరిస్థితి లేదని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పటీకీ ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యోల్భణం ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయికి చేరుకుంది. డాలర్ తో పాకిస్తాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఇదిలా ఉంటే మరోవైపు మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత అయిన ఇమ్రాన్ ఖాన్‌ని అవినీతి ఆరోపణలతో జైలులో పెట్టింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించింది. ఇక పాక్ సైన్యం తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఉండేలా పావులు కదుపుతోంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ ని జైలులో పెట్టి, ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ని దేశంలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!