ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మే 9న జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేసేందుకు పాక్ కోర్టు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జిల్లా జైలులో ఉన్నారు.
Weight Loss Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తీసుకుంటే చాలు.. బెల్లీ ఫ్యాట్ మయం..
లాహోర్ పోలీసు ఇన్వెస్టిగేషన్ చీఫ్ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా.. మే 9న జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసి విచారించాలని లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు ఆదేశించినట్లు పలు వార్త కథనాలు తెలుపుతున్నాయి. జిన్నా హౌస్ దహనం కేసులో మాజీ ప్రధాని ప్రమేయం ఉన్నందున ఆయనపై విచారణ జరిపి అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ పై విచారణ జరిపేందుకు దర్యాప్తు బృందాన్ని అటాక్ జైలుకు పంపనున్నారు. ఈ బృందం తన నివేదికను కోర్టుకు సమర్పించనుందని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రకారం.. కాల్పుల కేసులో ఖాన్ అరెస్టును ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
Kishan Reddy: వారి తప్పుడు విధానాల వల్లే రైతులకు మేలు జరగడం లేదు
మే 9న జరిగిన విధ్వంసం కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలటరీ రేంజర్‌లు అరెస్టు చేశాయి. ఆ తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రభుత్వంపై వ్యతిరేక నిరసనలు చేపట్టారు. అంతేకాకుండా.. లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ హౌస్, రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయంతో సహా వివిధ కార్యాలయాలపై దాడులు చేశారు. పోలీసులు, ఇతర భద్రతా సంస్థల వాహనాలకు నిప్పు పెట్టారు. హింసాత్మక నిరసనల తరువాత.. చట్ట అమలు సంస్థలు పాకిస్తాన్ వ్యాప్తంగా 10,000 మంది PTI కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిలో 4,000 మంది పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవారు ఉన్నారు. మరోవైపు ఈ దాడులతో తమకు సంబంధం లేదని PTI సభ్యులు తెలుపుతుండగా.. తమ దగ్గర ఆధారం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.