Pakistan: ఆర్థిక, రాజకీయ అస్థిరతతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ లో 2024 జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. నియోజకవర్గాల విభజనను సమీక్షించింది, సెప్టెంబర్ 27న తొలి జాబితా విడుదల చేసేందుకు పాక్ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుందని అక్కడి డాన్ న్యూస్ వెల్లడించింది.
దేశంలో అల్లకల్లోలానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ గూఢచారి ఫైజ్ హమీద్ కారణమని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని ఆయన అన్నారు.
Imran Khan: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ దోషిగా శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఈ రోజు ఈ కేసుపై ఇస్లామాబాద్ హైకోర్టు విచారించింది
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను అక్కడి ప్రభుత్వం ‘తోషాఖానా కేసు’లో అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. ఇదిలా ఉంటే జైలులో ఉన్నా ఇమ్రాన్ ఖాన్ సకల సదుపాయాలను అనుభవిస్తున్నారు. ప్రత్యేకమైన సూట్ లా ఫీల్ అవుతున్నారు.
చేతులు కాలాకా.. ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది ఇస్లామాబాద్ హైకోర్టు చెప్పే విషయం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు విధించిన శిక్షలో పొరపాటు జరిగిందని ఇప్పుడు ప్రకటించింది
ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మే 9న జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసి దర్యాప్తు చేసేందుకు పాక్ కోర్టు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది.
పాకిస్థాన్ మాదీ విదేశాంగ మంత్రి, ఇమ్రాన్ఖాన్ సన్నిహితుడైన షా మహమ్మద్ ఖురేషీని పోలీసులు అరెస్ట్ చేయడం దాయాది దేశంలో ప్రకంపనలు రేపుతోంది. అధికారిక రహస్యాల చట్టం కింద ఖురేషీని అదుపులోకి తీసుకోవడం ఈ సంచలనాలకు కారణమైంది.
పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీని శనివారం అరెస్టు చేశారు. ఖురేషీని ఇస్లామాబాద్లో అరెస్టు చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
పాకిస్తాన్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెయ్యేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారని, తన దేశం కోసం జైలు శిక్షను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా ఓ నివేదికలో పేర్కొంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాను ఇప్పుడుంటున్న జైల్లో ఉండలేనని.. తనను వేరే జైలుకు మార్చేలా చూడాలని తన తరపు న్యాయవాదులకు చెప్పినట్టు పాక్ మీడియా వెల్లడించింది.