Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశంతో యుద్ధానికి ఆరాపడుతున్నాడని, అయితే ఇమ్రాన్ ఖాన్ భారతదేశంతో, బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ అన్నారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ‘‘ఇస్లామిక్ కన్జర్వేటివ్’’గా ఆరోపిస్తూ, ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘స్వచ్ఛమైన లిబరల్’’గా ఆమె అభివర్ణించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ కొద్దిరోజులుగా జోరుగా వదంతులు నడిచాయి. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆధ్వర్యంలో హత్య జరిగిందంటూ పుకార్లు నడిచాయి. ఉద్రిక్తతలు
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ‘‘ప్రాణాలతోనే’’ ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖాన్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా పాక్ వ్యాప్తంగా ఇమ్రాన్ మరణించారని, ఆయనను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే ఊహాగానాలు వెలువడ్డాయి.
Imran Khan: గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలపై రావల్పిండిలోని అడియాలా జైలులో గత మూడేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ గత నాలుగు వారాలుగా కనిపించలేదు. ఆయనను కలిసేందుకు ఆయన చెల్లెళ్లను, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రికి కూడా అనుమతించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. పీ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హత్యకు గురయ్యారంటూ గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు ఆయన క్షేమంగా ఉన్నారంటూ ప్రభుత్వం చెబుతోంది. అలాగైతే తమకు చూపించాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ ఇటీవల ఆ దేశంలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవరిని అనుమతించకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లతో సహా, ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎంను కూడా అధికారులు…
Pakistan: జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి.? ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. ప్రస్తుతం మాజీ ప్రధాని స్థితి, పరిస్థితిని తెలుసుకునేందుకు పాకిస్థాన్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వం మాత్రం ఆయన క్షేమంగానే ఉన్నారని చెప్పినా నమ్మసక్యంగా అనిపించడం లేదు. షాబాజ్ ప్రభుత్వం, వల్పిండిలోని అడియాలా జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని పదే పదే చెబుతున్నప్పటికీ కుటుంబీకులు, పార్టీ…
Imran Khan vs Asim Munir: అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రావల్పిండి అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ హత్య చేయబడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో పాక్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. జైలు అధికారులు, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌లు మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యం ఉన్నాడని ప్రకటన ఇవ్వడం కూడా పరిస్థితిని చక్కబడేలా చేయలేదు.
Imran Vs Asim: ఒక్క సంతకం... కేవలం ఒకే ఒక్క సంతకం... ఒక దేశ చరిత్రను, ఒక శక్తివంతమైన నాయకుడి తలరాతను ఎలా మార్చేస్తుందో తెలుసా? 2019లో ఇమ్రాన్ ఖాన్ పెట్టిన ఆ ఒక్క సంతకం, ఇప్పుడు 2025లో ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ లోని అడియాలా జైలు గోడల వెనుక అసలేం జరుగుతోంది?,
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.