Hydra Report on Illegal Construction in Hyderabad: హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ.. అక్రమార్కుల గండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఏ రోజు, ఎప్పుడు హైడ్రా కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో వణుకు పుడుతోంది. ఈ క్రమ్మలో కొందరు అయితే హైడ్రా నుంచి నోటీసులు అందక ముందే.. కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది. గత 20 రోజులుగా నగర వ్యాప్తంగా చేపట్టిన…
భూపాలపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ భూమి 209 సర్వే నెంబర్ లో అక్రమ కట్టడాలు చేపట్టారని రెవెన్యూ,మున్సిపల్ అధికారులు సంయుక్తంగా నోటీసులు జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ వద్ద గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా సంబంధిత భవన ధ్రువపత్రాలు చూపని ఎడల కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
అక్రమ నిర్మాణాలపై యాక్షన్ ప్లాన్ కొనసాగుతున్నది. గురువారం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక అపార్ట్ మెంట్ లో ఉన్న రెండు బ్లాక్ లపై అక్రమ అంతస్తుల నిర్మాణాలను డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ యంత్రాంగం కూల్చి వేసింది. నిజాం పేట్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 92/పి లో ఒక యజమాని తనకు ఉన్న 840 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్ + 2 అంతస్తుల భవనానికి అనుమతి తీసుకుని మూడు(3) బ్లాక్ లను స్లిట్ +5…
నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములు వంటి అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న కూల్చివేత చర్యల్లో భాగంగా గురువారం నాల్గవ రోజు ఐదు మున్సిపాలిటీల పరిధిలో 12 పెద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. మొత్తంగా గత నాలుగు…
అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) తగ్గేదేలే అంటోంది. నార్సింగి మునిసిపల్ గౌలిదొడ్డిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానుల గుండెల్లో హెచ్ ఎండీఏ అధికారులు రైళ్లు పరిగెత్తిస్తున్నారు. 111 జీవోకు తూట్లు పెట్టి యజమానులు బహుళ అంతస్తు భవనాలు నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. 111 జీవోలో జీ+1 మాత్రమే అనుమతులు ఉండగా, జీ+6 బహుళ అంతస్తుల భవనాలను బిల్డర్స్ చేపట్టారు. పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా నార్సింగి కమీషనర్,…
అక్రమ విల్లాలపై హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. దుడింగల్ మల్లంపేటలో అక్రమ విల్లాలపై ప్రభుత్వం సీరియస్ అవడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెలాఖరులోగా అక్రమ విల్లాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మల్లంపేటలోని లక్ష్మీశ్రీనివాస్ పేరుతో 65 విల్లాలకే హెచ్‌ఎండీఏ అనుమతి ఇచ్చింది. అయితే 260 విల్లాలకు అనుమతి ఉందంటూ లక్ష్మీశ్రీనివాస్ సంస్థ నకిలీ పత్రాలు సృష్టించింది. అంతేకాకుండా 325 విల్లాలు…
మహానగరంలో మాయగాళ్లకు కొదవేలేదు అంటుంటారు. ఎందుకంటే.. రోజురోజుకు భాగ్యనగరంలో కొత్తకొత్త రూపాల్లో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి. అందులో అక్రమ నిర్మాణాలు కూడా ఒకటి. అయితే హైదరాబాద్‌లో నకిలీ ధృవప్రతాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై హెచ్‌ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది. హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ కట్టడాల పై కొరడా ఝుళిపించేందుకు అధికార యంత్రాగాన్ని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30 లోపు అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేయాలని హెచ్‌ఎండీఏ పరిధిలోని మునిసిపల్ కమిషనర్…