Hydra Report on Illegal Construction in Hyderabad: హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ.. అక్రమార్కుల గండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఏ రోజు, ఎప్పుడు హైడ్రా కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో వణుకు పుడుతోంది. ఈ క్రమ్మలో కొందరు అయితే హైడ్రా నుంచి నోటీసులు అందక ముందే.. కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది. గత 20 రోజులుగా నగర వ్యాప్తంగా చేపట్టిన కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ అందించింది.
ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక అందిచింది. 18 చోట్ల కూల్చివేతల్లో ఏకంగా 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. నంది నగర్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, లోటస్పాండ్, బీజేఆర్నగర్, ఎమ్మెల్యే కాలనీ, అమీర్పేట్, గాజులరామారంలో పలు నిర్మాణాలకు నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. ప్రముఖులైన పల్లంరాజు, సునీల్ రెడ్డి, రత్నాకర్రాజు, భాస్కర్రావు, అనుపమ కట్టడాలు సహా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చి వేసినట్లు హైడ్రా తన రిపోర్ట్‌లో తెలిపింది. ప్రముఖుల ఫామ్‌హౌస్‌లను హైడ్రా కూల్చివేసింది.
కూల్చివేతల లిస్ట్:
# నంది నగర్‌లో ఎకరం స్థలాన్ని కబ్జాకార నుంచి కాపాడిన హైడ్రా
# లోటస్ పాండ్‌లో పార్కు కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దానిని కాపాడిన హైడ్రా
# మనసురాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేత
# ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేత
# మిథాలీ నగర్‌లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
# బీజేఆర్ నగర్‌లో నాలాను కబ్జా నుంచి కాపాడిన హైడ్రా
# గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేత
# గాజుల రామారావు భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రములను చేసిన బోనాలు కూల్చివేత
# బంజారా హిల్స్‌లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేత
# చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రా
# నందగిరి హిల్స్‌లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేత
# రాజేంద్రనగర్ చెరువులు కబ్జాలు కూల్చివేత
# చందానగర్ ఏర్ల చెరువులో కబ్జాలు కూల్చివేత
# ప్రగతి నగర్ ఎర్రగుంటలో నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేత
# బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలు కూల్చివేత
# గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్‌హౌస్‌లు కూల్చివేత
ప్రముఖుల లిస్ట్:
# ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్
# ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా బేగ్
# మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు
# టీటీడీ మాజీ సభ్యుడు, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్రావు
# మంతిని బీజేపీ నేత సునీల్ రెడ్డి
# ప్రో కబడ్డీ యజమాని అనుపమ
# హీరో నాగార్జున
# ఎమ్మెల్యే దానం నాగేందర్