హైదరాబాద్‌లోని పోచారంలో 1978లో 27 ఎకరాల భూమి మీద 400 ప్లాట్లతో ఏర్పాటు చేసిన జీపీ లే అవుట్‌లో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా సిబ్బంది తొలగించారు. ఈ లే అవుట్‌లో ఒక వ్యక్తి 6.18 ఎకరాల భూమిని తనదేంటూ అక్రమంగా ప్రహరీ నిర్మించినట్టు సొసైటీ సభ్యులు వాదించారు. ఈ వ్యవహారం సుమారు 8 ఏళ్లుగా కొనసాగుతూ, సొసైటీ సభ్యులు అనేక మార్ల ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. Kurnool Bus Fire :…
Perni Nani: మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడని వైసీపీ నేత పేర్నినాని అన్నారు. కొల్లు రవీంద్ర స్వార్ధం కోసం జనంతో ఆటలాడుతున్నారు.. 13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు.. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్ ను రెడీ చేసుకున్నారు.
Bulldozer Action: ఇటీవల ‘‘ ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా అల్లర్లకు కారణమైంది. బరేలీలో గత శుక్రవారం ప్రార్థనల తర్వాత గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఆ తర్వాత, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ అల్లర్లు కౌశాంబి, కాన్పూర్‌లతో పాటు గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి వివిధ ప్రదేశాలకు వ్యాప్తించాయి. అయితే, ఈ అల్లర్లకు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇత్తేహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ (IMC) అధ్యక్షుడు తౌకీర్ రజా ఖాన్‌ను యూపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్…
విశాఖ శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది.. తిరుమలలోని విశాఖ శారదా పీఠాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది టీటీడీ.. 15 రోజుల్లోగా ఖాళీచేసి టీటీడీకి అప్పగించాలని ఆదివారం రోజు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది టీటీడీ..
Bhadradri Incident : భద్రాచలం పట్టణంలో ఒక ఆధ్యాత్మిక సంస్థ నిర్మించిన ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ భవనాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి పాత భవనంపై నిర్మించారు. అయితే, దీనిపై 120కు పైగా ఫిర్యాదులు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా ఈ భవనం నాణ్యతలేమి, నిర్మాణం ప్రామాణికతలేకపోవడం గురించి స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ, కేవలం తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయడమే…
India-Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ అతి చేస్తోంది. ముఖ్యంగా తన స్థాయి ఏమిటో మరిచిపోయి భారత్‌కి వార్నింగ్ ఇస్తోంది. అక్కడి జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్ వంటి మతోన్మాద, తీవ్రవాద సంస్థలు భారత దేశాన్ని బెదిరించేలా ప్రకటనలు చేస్తున్నాయి.
HYDRA : అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేత చేపట్టి 5 అంతస్తుల భవనం నేల మట్టం చేసింది. అయితే దీనిపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజీలోని అయ్యప్ప సొసైటీ సర్వే నంబరు 11/5 లో ప్లాట్ నంబరు 5/13 పేరిట 684 గజాలలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేసింది హైడ్రా.. ఈ కూల్చివేతలో స్థానిక పోలీసులతో పాటు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను…
AV Ranganath : అయ్యప్ప సొసైటీ కూల్చివేత లపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ ప్రకటన విడుదల చేశారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. గతంలో స్లాబ్‌పై కొన్ని రంధ్రాలు చేయబడ్డాయని, బిల్డర్ రంధ్రాలను మూసివేసి 7 అంతస్తుల అక్రమ నిర్మాణానికి ముందుకొచ్చాడన్నారు. హైకోర్టులో ధిక్కార పిటిషన్ కూడా దాఖలైంది, విచారణలో ఉందని ఆయన తెలిపారు. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్ని నిర్మాణాలు చట్టవిరుద్ధమని, ప్రస్తుతం కూల్చివేసిన భవనాన్ని అక్రమంగా…