Pakistan: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ బౌలర్ సదియా ఇక్బాల్ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. సదియా, ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. గత వారం ర్యాంకింగ్స్‌లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆమె ఓ స్థానం మెరుగుపర్చుకుంది. అయితే, సదియా ఖాతాలో 746 రేటింగ్ పాయింట్లు ఉండగా.. భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (737 పాయింట్లు), ఆసీస్ బౌలర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక, సోఫీ ఎక్లెస్టోన్ ఖాతాలో 734 పాయింట్లు ఉండటంతో నాలుగో స్థానానికి పడిపోయింది.
Read Also: Kamal Haasan: కన్నడ, తమిళ వివాదంలో కమల్ హసన్.. కర్ణాటకలో ఆయన సినిమాలపై బ్యాన్..!
ఇక, భారత పేసర్ రేణుక సింగ్ ఠాకూర్ ఐదో స్థానంలో కొనసాగుతుంది. అలాగే, ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్ ఏకంగా 13 స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకుంది. మరో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్, పాక్ బౌలర్ సష్రా సంధు, ఆస్ట్రేలియా బౌలర్ జార్జియా వేర్హమ్ ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక, ఇంగ్లండ్ బౌలర్ సారా గ్లెన్ 10వ స్థానంలో ఉంది. టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 16, శ్రేయాంక పాటిల్ 21, పూజా వస్త్రాకర్ 33 స్థానాల్లో కొనసాగుతున్నారు.
Read Also: CM Revanth Reddy: భూభారతి పేద రైతులకు చుట్టం.. అవగాహన సదస్సులు నిర్వహించాలి
అలాగే, బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బెత్ మూనీ నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. విండీస్ స్టార్ బ్యాటర్ హేలీ మాథ్యూస్ రెండో స్థానం ఉంది. ఆసీస్ బ్యాటర్ తహిళ మెక్‌గ్రాత్, టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక, ఆల్‌రౌండర్లలో.. హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, దీప్తి శర్మ టాప్-3లో ఉన్నారు.