IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమిండియా అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తుంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగకుండా అజేయంగా దూసుకెళుతుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొనుంది. ఇక, భారత, న్యూజిలాండ్ క్రికెటర్లు నెట్స్ లో చెమటోడుస్తున్నారు.
దుబాయ్ వేదికగా ఆదివారం నాడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ సేన తలపడబోతుంది. కాగా, ఈ మెగా వన్డే టోర్నమెంట్ తర్వాత భారత జట్టులో కీలక మార్పు జరగబోతున్నాయని సమాచారం. రోహిత్ శర్మ వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి గుడ్ బై పలికి కేవలం ప్లేయర్ గా కొనసాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య చర్చలు కూడా కొనసాగినట్లు తెలుస్తుంది.
Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని ఉద్దేశించి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ గురువారం దారుణమైన విమర్శలు చేయడంపై క్రీడాభిమానులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దేశం కోసం ఆడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మతాన్ని ఆపాదించడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజన్ మాసంలో ‘రోజా’ను పాటించకుండా, మ్యాచ్ సమయంలో షమీ నీరు, ఇతర డ్రింక్స్ తాగడాని షాబుద్దీన్ అన్నారు. షమీని క్రిమినల్‌గా పోల్చుతూ విమర్శించారు.
భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ సెంట్రల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభించాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని చెప్పారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుండి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ పొందనుంది. పాకిస్తాన్‌కు ఐసీసీ నుండి దాదాపు రూ. 2 కోట్ల 37 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ టోర్నీలో ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లకు 1.40 లక్షల డాలర్లు అంటే దాదాపు 1 కోటి 22 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్‌కు ప్రైజ్ మనీ అందుతుది.
IND vs PAK: దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్- పాకిస్తాన్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా కొనసాగనుంది.
IND vs PAK: అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్థాన్‌పై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా ఏళ్లుగా భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడంతా పాక్ పైనే ఉంటుంది. పైగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్ ఓడి, సంక్లిష్ట స్థితిలో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది దాయాది జట్టు.
పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బుధవారం కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన టోర్నమెంట్-ఓపెనర్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్‌కు ఐసిసి జరిమానా విధించింది.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి తెరలేచింది. నేడు ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజీలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు గెలుపు కోసం పోటీపడ్డాయి. తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన న్యూజీలాండ్ ఛాంపియన్ ట్రోఫీలో ఖాతా తెరిచింది. 60 పరుగుల తేడాతో పాక్ పై కివీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్…
కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన వివాదానికి దారి తీసింది. దీంతో భారత జాతీయ జెండాను ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడంతో పాక్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దెబ్బకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఇక, దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ స్టేడియంలో ఇండియన్ ఫ్లాగ్ ను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.