IND vs PAK: దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్- పాకిస్తాన్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా కొనసాగనుంది.
IND vs PAK: అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్థాన్‌పై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా ఏళ్లుగా భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడంతా పాక్ పైనే ఉంటుంది. పైగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్ ఓడి, సంక్లిష్ట స్థితిలో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది దాయాది జట్టు.
పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బుధవారం కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన టోర్నమెంట్-ఓపెనర్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్‌కు ఐసిసి జరిమానా విధించింది.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి తెరలేచింది. నేడు ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజీలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు గెలుపు కోసం పోటీపడ్డాయి. తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన న్యూజీలాండ్ ఛాంపియన్ ట్రోఫీలో ఖాతా తెరిచింది. 60 పరుగుల తేడాతో పాక్ పై కివీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్…
కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన వివాదానికి దారి తీసింది. దీంతో భారత జాతీయ జెండాను ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడంతో పాక్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దెబ్బకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఇక, దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ స్టేడియంలో ఇండియన్ ఫ్లాగ్ ను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.
Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.
BCCI: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమి తర్వాత ప్లేయర్స్, స్టాఫ్‌కు సంబంధించి బీసీసీఐ కఠిన నిబంధనలు విధించింది. ఇకపై క్రికెటర్లు తమ భాగస్వాములు, ఫ్యామిలిని వెంట తీసుకెళ్లడం సహా పలు సౌకర్యాల విషయంలో ఆంక్షలు పెట్టింది.
టీమిండియా జెర్సీలపై పాక్ పేరును తొలగించాలంటూ గతంలో పలువురు క్రికెట్ అభిమానులు డిమాండ్ చేసినప్పటికీ.. బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. టోర్నీ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు.
ICC Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వివరణ ఇచ్చింది. ఈ టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలను స్టేడియం పైకప్పుపై ఎగురవేస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..