ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచు లో ఇంగ్లండ్ అదరగొట్టింది. మూడు టెస్టుల సిరీస్ లోని తొలి టెస్ట్ మ్యాచ్ లో రూట్ సెంచరీతో(115*) కదంతొక్కాడు. రూట్ సెంచరీతో ఇంగ్లండ్ జట్టు తొలి టెస్టులో న్యూజిలాండ్ పై విజయం నమోదు చేసింది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. 277 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన ఇంగ్లండ్ ఓ దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా,…
నెదర్లాండ్స్ జట్టు కాసేపు వెస్టిండీస్‌కు ముచ్చెమటలు పట్టించింది. కానీ బ్రాండన్ కింగ్ (91పరుగులు) చేయడంతో విండీస్ గెలుపొందింది. వన్డే సిరీస్ లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మొదటి వన్డేలో 7వికెట్ల తేడాతో సులభంగా గెలిచిన వెస్టిండీస్, 2వ వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆమ్స్టెల్వీన్లో జరిగిన రెండో వన్డేలో మరో 4.3ఓవర్లు మిగిలి ఉండగానే 5వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపొందింది. నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నెదర్లాండ్స్ ఓపెనర్లు…
సంచలనాల జట్టు బాంగ్లాదేశ్ క్రికెట్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. పేలవమైన ఫామ్ వల్ల మోమినుల్ హక్ బంగ్లాదేశ్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం మూడోసారి టెస్ట్ కెప్టెన్‌గా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను నియమించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నెలాఖరులో వెస్టిండీస్‌లో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇక ఈ సిరీస్‌కు ముందు షకీబ్‌ను కెప్టెన్‌గా నియమించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బ్యాట్స్‌మన్ లిటన్ దాస్‌ను కొత్త వైస్ కెప్టెన్‌గా…
తింటే గ్యారలే తినాలి చూస్తే ఇండియా ,పాక్ క్రికెట్ మ్యాచ్ ఏ చూడాలి. నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం,విజయం కోసం ఆఖరి వరకు పోరాటం. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం. ఆటగాళ్లు సాధారణంగా కనిపించరు సింహాల లాగ కనిపిస్తారు. ఇలా కేవలం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లోనే చూస్తాం.అయితే అలాంటి పోరు కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ICC మెగా ట్రోఫీలు కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ…
అంతర్జాతీయ క్రికెట్లో విప్లవాత్మక మార్పులు రావాలని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు. ద్వైపాక్షిక సిరీసులు ఆడకుండా ఇకనుండి ఏడాదికి రెండుసార్లు IPL నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాడు. ICC T20 ప్రపంచకప్ ఫైనళ్లను తప్ప మిగతా మ్యాచుల్ని ఎవరైనా గుర్తు పెట్టుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ‘ఏడాదికి రెండు IPL సీజన్లే భవిష్యత్తు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఫ్రాంచైజీ క్రికెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. రెండు సీజన్లకు 70-70గా విభజించొచ్చు’ అని రవిశాస్త్రి అన్నాడు. ఆటగాళ్లపై ద్వైపాక్షిక…
నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టెల్వీన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్స్‌పై వెస్టిండీస్ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. షాయ్ హోప్ అజేయ సెంచరీతో చెలరేగడంతో విండీస్ విక్టరీ కొట్టింది. అయితే వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 45ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా నెదర్లాండ్స్ 247 లక్ష్యాన్ని వెస్టిండీస్ ముందు పెట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో మన తెలుగు తేజం తేజా నిడమనూరు ఆకట్టుకున్నాడు. విజయవాడకు చెందిన…
పసికూన జట్టు అనే స్థాయి నుండి అగ్ర జట్లను సైతం ముచ్చెమటలు పట్టించే స్థాయికి ఎదిగింది బంగ్లాదేశ్ జట్టు. అలాంటి బంగ్లాదేశ్ క్రికెట్లో ఉన్నట్టుండి ఇప్పుడు ప్రకంపనలు చెలరేగాయి. ఉన్నట్టుండి ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ మోమినుల్ హక్ రాజీనామా ప్రకటించడం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మోమినుల్ హక్ ఈ సంవత్సరంలో పేలవమైన ఫామ్ కనబర్చుతున్నాడు. తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికి అతను మంగళవారం టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు.…
మహిళల వరల్డ్ కప్ ముగియడంతో టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రత్యేకంగా ఓ జట్టును రూపొందించింది. ఈ మేరకు ఈ జట్టు వివరాలను సోమవారం ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ జట్టులో భారత మహిళలకు చోటు దక్కలేదు. చివరకు బంగ్లాదేశ్ మహిళలకు కూడా ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన జట్టులో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లకు.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు స్థానం…
ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా మహిళల ప్రపంచకప్ జరుగుతోంది. అయితే పురుషుల ప్రపంచకప్ ప్రైజ్ మనీతో పోలిస్తే మహిళల ప్రపంచకప్ ప్రైజ్ మనీ తక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పురుషుల, మహిళ ప్రపంచకప్ టోర్నీల ప్రైజ్ మనీల మధ్య సమానత్వం తీసుకొచ్చేందుకు ఐసీసీ అడుగులు వేస్తోంది. రాబోయే 8 ఏళ్లలో మహిళల క్రికెట్ ఈవెంట్లకు సంబంధించి జరిగే చర్చల్లో దీనిపై మరింత చర్చిస్తామని ఐసీసీ సీఈవో జియోఫ్ అలార్డైస్ అన్నారు. కాగా 2019లో జరిగిన పురుషుల…
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ ఆడుతోంది భారత మహిళల జట్టు.. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడి 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్న మిథాలీ సేన.. వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది.. ఇక, టాప్ 4లో స్థానం దక్కాలంటే మాత్రం.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తప్పనిసరిగా విజయం సాధించాలి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా… టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఈ సిరీస్‌లో ముందుకు సాగాలంటే.. ఈ మ్యాచ్…