Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది ఐసీసీ. ఆదివారం నాడు దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోపు భారత్, పాకిస్థాన్ జట్లు తమ ఓవర్లను పూర్తి చేయలేకపోయాయి. దీంతో రెండు జట్లు జరిమానా బారిన పడ్డాయి. ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ రిఫరీ ముందు తమ తప్పును అంగీకరించారని ఐసీసీ ప్రకటించింది. ఇటీవల…
ICC Rankings: ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులేకుండా టీమిండియా తన మూడో ర్యాంకును నిలబెట్టుకుంది. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసిన భారత్ మరో మూడు రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకొని 111 పాయింట్లతో తమ ర్యాంకును మరింత పదిలం చేసుకుంది. మరోవైపు నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్థాన్ సైతం ఒక పాయింట్‌ను పెంచుకుని 107 పాయింట్లతో నాలుగో స్థానంలో…
Team India: వచ్చే నాలుగేళ్ల పాటు టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. ఈ మేరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ)ను ప్రకటించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నాలుగేళ్లలో భారత్ భారీ స్థాయిలో మ్యాచ్‌లను ఆడబోతోంది. 2023, మే నుంచి 2027, ఏప్రిల్ మధ్య 38 టెస్టులు, 39 వన్డేలు, 61 టీ20లు ఆడనుంది. ఇవి కాకుండా ఐసీసీ ఈవెంట్లు అదనం. అంటే వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీలు…
ICC Posted Dhoni Video: టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్లు పూర్తవుతోంది. 2020, ఆగస్టు 15న ధోనీ తన రిటైర్మెంట్ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే ధోనీ రిటైర్మెంట్కు రెండేళ్లు పూర్తి కావడంతో ఐసీసీ ప్రత్యేక నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ధోనీకి సంబంధించిన కొన్ని చిరస్మరణీయ స్మృతులను చూపించింది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్,…
భారత్-ఇంగ్లండ్ చివరి టెస్ట్ ముగిసిన తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఈ మ్యాచ్ రెండు ఇ న్నింగ్స్లలోనూ కోహ్లీ విఫలం కావడంతో అతడి ర్యాంక్ పడిపోయింది. దీంతో ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఐసీసీ టాప్-10లో విరాట్ కోహ్లీ పేరు గల్లంతయ్యింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 11, 20 స్కోర్లు చేసిన కోహ్లి తాజా టెస్టు ర్యాంకుల్లో 13వ స్థానానికి దిగజారాడు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.…
క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్‌కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ లీగ్ ప్రారంభం అవుతోందంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే పండగలాంటి వాతావరణం నెలకొంటుంది. ఇంత క్రేజ్ ఉండటం వల్లే.. ఈ లీగ్‌ను మరింత పొడిగించాలని నిర్ణయించారు. అవును, ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపాడు. రానున్న సీజన్ల నుంచి ఐపీఎల్‌ను రెండున్నర నెలలకు పెంచబోతున్నట్టు ఆయన స్పష్టం చేశాడు. అంటే.. వరుసగా 10…
కటక్ వేదికగా జరిగిన భారత్,దక్షిణాఫ్రికా రెండవ టీ20 లో భారత్ భొక్కబోర్ల పడింది. తొలుత టాస్ గెలిచినా దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుండే తడపడింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే గైక్వాడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తరువాత వచ్చిన భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతాడనుకున్న కెప్టెన్ పంత్ కూడా అనవసరపు షాట్ ఆడీ వికెట్ సమర్పించుకున్నాడు. ఓపెనర్ ఇషాంత్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్…
ఇంగ్లాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులకి ఆలౌటైంది. ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ టీమ్.. రెండో టెస్టులో గొప్ప పోరాట పటిమని కనబర్చింది. ఆ జట్టులో డార్లీ మిచెల్ (190: 318 బంతుల్లో 23×4, 4×6) భారీ శతకం నమోదు చేయగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (106: 198 బంతుల్లో 14×4)…
వరుసగా 13 మ్యాచులు గెలిచి, ప్రపంచ రికార్డు విజయం సాధించాలనుకున్న టీమిండియా ఆశ నెరవేరలేదు. తొలి T20 ముందు వరకు కూడా 12 విజయాలతో పొట్టి ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్, రొమేనియాలతో కలిసి సమానంగా ఉన్న భారత్ జట్టుకు దక్షిణాఫ్రికా రూపంలో కళ్లెం పడింది. దాంతో వరుస విజయాల రికార్డును తన పేరిట లిఖించుకోలేకపోయింది. ఇక రేపు జరిగే రెండో T20 కోసం భారత జట్టు సిద్ధం అవుతోంది. ఒడిశా వేదికగా…
IPL 2022 సీజన్లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు తమ ఆట తీరు మార్చుకోవాలని భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ అన్నాడు. పేరుకు పెద్ద ఆటగాళ్లు అయితే సరిపోదని, జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపాడు. అలా చేయకుంటే జట్టు నుంచి తప్పించడం మేలని అభిప్రాయపడ్డాడు. IPL 2022 సీజన్లో ముంబై సారథి రోహిత్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 19.14 సగటుతో 268 పరుగులే…