ICC Rankings: టీమిండియాతో వన్డే సిరీస్ ఎఫెక్ట్.. న్యూజిలాండ్ నంబర్‌వన్ ర్యాంక్ పాయె..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Rankings: టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఓడిపోయింది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన అసలే వన్డే సిరీస్ ఓడిపోయిన బాధలో ఉన్న న్యూజిలాండ్‌కు మరో షాక్ తగిలింది. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోయింది. దీంతో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అయితే మూడో వన్డేలోనూ భారత్ గెలిస్తే న్యూజిలాండ్ మూడో స్థానానికి పడిపోవడంతో పాటు టీమిండియా నంబర్‌వన్‌గా అవతరించనుంది.
Read Also: Wasim Jaffer: టీమిండియా స్టార్ ఆటగాళ్లందరూ రంజీలు ఆడాల్సిందే..!!
Also Read
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, టీమిండియాకు సమానంగా 113 పాయింట్లే ఉన్నాయి. అయితే సాంకేతికంగా ఇంగ్లండ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. న్యూజిలాండ్, టీమిండియా జట్లు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. రెండో వన్డేకు ముందు కివీస్ 115 పాయింట్లతో ఐసీసీ ర్యాంకుల్లో మొదటి స్థానంలో ఉంది. 113 పాయింట్లతో ఇంగ్లండ్, 112 పాయింట్లతో ఆస్ట్రేలియా, 111 పాయింట్లతో టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. రెండో వన్డేలో కివీస్ ఘోరంగా ఓడిపోవడంతో ర్యాంకులు తారుమారయ్యాయి. రాయ్‌పూర్ వన్డేలో గెలవడంతో టీమిండియా ఖాతాలో రెండు పాయింట్లు చేరగా.. కివీస్ ఖాతాలో రెండు పాయింట్లు తగ్గాయి. దీంతో టాప్-3లో ఉన్న జట్ల పాయింట్లు సమం అయ్యాయి. కాగా ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో, పాకిస్థాన్ 106 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!