సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్వీన్ స్వీప్ చేసింది. ఈ రెండు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. 58 శాతం విజయాలతో ఐదు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటివరకు నాలుగు సిరీస్‌లు ఆడిన టీమిండియా ఆరు విజయాలు సాధించింది. మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మొత్తంగా…
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగిన రావల్పిండి పిచ్‌కు ఐసీసీ బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఐదేళ్లలో 5 డీమెరిట్ పాయింట్లు వస్తే 12 నెలల పాటు ఆ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు వీల్లేదు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఆడిన తొలి టెస్టులో పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలించింది. దీంతో పాకిస్థాన్…
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను ప్రకటించింది. టీమ్ ర్యాంకుల్లో ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అటు బౌలర్ల ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షాంసీ అగ్రస్థానంలో ఉండగా… ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ రెండో స్థానానికి దూసుకెళ్లాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణించడంతో అతడు నాలుగు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. టాప్-10 బౌలర్లలో టీమిండియా నుంచి ఒక్కరు కూడా లేరు. ఇక బ్యాటింగ్ ర్యాంకుల్లో పాకిస్థాన్…
అండర్-19 టీమిండియా కెప్టెన్ యష్ ధుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. అతడి నేతృత్వంలోని యువ భారత్ ఇంగ్లండ్‌ను ప్రపంచకప్ ఫైనల్లో మట్టికరిపించి ఐదోసారి వరల్డ్ ఛాంపియన్లుగా నిలిచింది. ఈ సందర్భంగా ఐసీసీ యష్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో విన్నింగ్ కెప్టెన్‌గా నిలిచిన యష్ ధుల్‌ను ఐసీసీ అప్‌స్టోక్స్ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. Read Also: చారిత్రక వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం అండర్-19…
క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం మరోసారి కలకలం సృష్టిస్తోంది.. జింబాబ్వే జట్టు కెప్టెన్‌గా, ఆ జట్టు తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన స్టార్ క్రికెటర్‌గా రికార్డులు సృష్టించిన జింబాబ్వే జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ వేటు వేసింది.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డానంటూ ఒప్పుకున్న టేలర్‌పై ఐసీసీ బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించింది.. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌లో మూడున్నరేళ్లు బ్యాన్ విధించగా.. ఇక, డోప్ టెస్ట్‌లో విఫలమైనందుకు ఒక నెల సస్పెన్షన్‌ను కూడా విధించింది.…
ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియాకు ఐసీసీ భారీ షాకిచ్చింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందని ఆరోపిస్తూ ఐసీసీ భారీగా ఫైన్ విధించింది. రాహుల్ సేన నిర్ణీత సమయం కంటే 2 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. దీంతో టీమిండియాకు ఐసీసీ 40 శాతం జరిమానా విధించింది. దీంతో భారత ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడనుంది. ఐసీసీ నియామవాళిలోని…
బెస్ట్ టీ20 క్రికెటర్ 2021 అవార్డుకు పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ ను ఎంపిక చేసింది ఐసీసీ.. పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైనట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. కాగా, 2021లో టీ-20ల్లో చెలిరేగి పోయాడు రిజ్వాన్.. 29 మ్యాచ్‌లు ఆడిన ఈ పాక్ ప్లేయర్.. 73.66 సగటుతో 1,326 పరుగులు చేశాడు.. స్ట్రయిక్ రేట్ 134.89 సాధించాడు.. బ్యాటింగ్‌లోనే కాదు.. మరోవైపు వికెట్ కీపర్‌గానూ…
టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. 12 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. Read Also: ఇకనైనా విహారికి అవకాశం ఇవ్వండి:…
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈనెల 16న వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధన ఆసక్తి రేపుతోంది. ఇక నుంచి బౌలింగ్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే మైదానంలో 30 గజాల సర్కిల్ బయట ఉండే ఫీల్డర్లలో ఒకరిని తగ్గించాల్సి ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. స్లో ఓవర్ రేటుకు పడే జరిమానాకు ఇది అదనం…