ICC: ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. దీంతో అందరూ ఆన్‌లైన్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. అయితే ఇదే సమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోయాయి. చాలా మంది సామాన్యులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. విచిత్రం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను నడిపించే ఐసీసీ కూడా సైబర్ నేరగాడి వలలో పడింది. 2.5 మిలియన్ డాలర్లకు పైగా ఐసీసీ మోసపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ కరెన్సీలో 2.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20 కోట్లు. దుబాయ్‌లోని ఐసీసీ కార్యాలయ అధికారులు ఈ ఆన్‌లైన్ మోసంపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.
Read Also: Petrol Rate: అక్కడ బంకుల్లో కంటే బ్లాక్ లోనే రేటు తక్కువట
మరోవైపు ఈ ఫిషింగ్ స్కాంపై ఐసీసీ అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు సైబర్ నేరగాడిని పట్టుకునే పనిలో పడ్డారు. అయితే బీసీసీఐ వంటి సంస్థకు 2.5 మిలియన్ డాలర్లు అంటే పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ రూపాయి అయినా 100 రూపాయలు అయినా మోసం మోసమే కాబట్టి ఐసీసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ మోసం ఐసీసీలో కలకలం రేపింది. ఐసీసీ నుంచి ప్రతి సంవత్సరం ODI హోదా కలిగిన అసోసియేట్ సభ్యుడు సంపాదించే గ్రాంట్‌కి ఇది నాలుగు రెట్లు సమానం. ఫిషింగ్ అనేది ఒక రకమైన సైబర్ క్రైమ్. ఈ సందర్భంలో స్కామర్‌లు ఈ-మెయిల్, ఫోన్ కాల్‌లు లేదా ఎస్ఎంఎస్‌ల ద్వారా బాధితులను లక్ష్యంగా చేసుకునేందుకు విశ్వసనీయ సంస్థలు లేదా వ్యక్తుల తరహాలో నటిస్తారు. పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ ఖాతా సమాచారం, క్రెడిట్ కార్డ్ సమాచారం, పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్‌ల వంటి వ్యక్తిగత సమాచారంతో సహా ప్రైవేట్ సమాచారాన్ని బహిర్గతం చేసేలా వారు సంస్థలు లేదా వ్యక్తులను ప్రలోభపెడతారు. ఈ ఫిషింగ్ స్కాం అనేది ఆర్థిక నష్టాలు లేదా దొంగతనానికి దారితీస్తుంది.