బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో సారి సౌరవ్ గంగూలీకి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు.
Sourav Ganguly: బీసీసీఐ నుంచి గంగూలీ నిష్క్రమణ ఖరారైంది. గత మూడేళ్లుగా బీసీసీఐ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన గంగూలీ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. దీంతో బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ ఎన్నిక కానున్నాడు. ఈనెల 18న ముంబైలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా రెండోసారి కూడా బీసీసీఐ కార్యదర్శిగానే…
Moen Ali: ఇటీవల భారత్-ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. మూడో వన్డేలో దీప్తి శర్మ ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో మన్కడింగ్ అవుట్ చేయడంతో టీమిండియాకు క్రీడా స్ఫూర్తి లేదంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై ఇంగ్లండ్ మెన్స్ క్రికెట్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మాట్లాడాడు. మన్కడింగ్ అవుట్‌ను పూర్తిగా క్రికెట్ చట్టాల నుంచి తీసేసి చట్ట విరుద్ధమని ప్రకటించాలని…
ICC Test Championship Finals: క్రికెట్లో టెస్ట్ క్రికెట్లో ఉండే మజానే వేరు. కానీ కొన్నేళ్లుగా టీ20లు రాజ్యమేలుతున్నాయి. దీంతో ఐసీసీ టెస్ట్ క్రికెట్ పునరుజ్జీవం కోసం టెస్టు చాంపియన్ షిప్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్ల మధ్య టెస్టు సిరీస్‌లు జరిపి పాయింట్ల ఆధారంగా రెండేళ్లకోసారి ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది తొలిసారిగా జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడగా న్యూజిలాండ్ విన్నర్‌గా…
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 46 పరుగులతో సూర్యకుమార్ రాణించాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను కిందకు నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు. బాబర్ ఆజమ్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన నెంబర్ వన్ స్థానాన్ని…
ICC New Rules: పురుషుల క్రికెట్లో ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని మెన్స్ కమిటీ సిఫారసులను చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (సీఈసీ) ఆమోదించింది. కొత్త నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం కరోనా సమయంలో రెండేళ్ల పాటు సలైవా (బంతిపై ఉమ్మి రుద్దడం)పై ఐసీసీ నిషేధం విధించగా ఇప్పుడు శాశ్వతంగా బ్యాన్ విధించింది. అటు టెస్టులు, వన్డేల్లో కొత్తగా వచ్చే బ్యాటర్…
ICC Rankings: ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు తమ హవా కొనసాగించారు. ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో ఓపెనర్ బాబర్ ఆజమ్ మూడో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రమ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇండియన్ క్రికెటర్స్ సూర్య కుమార్ యాదవ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 14వ స్థానంలో ఉన్నాడు. అటు కింగ్ కోహ్లీ 15వ స్థానానికి…
ICC Player Of the Month: ఆగస్టు నెలకు సంబంధించి మూడు ఫార్మాట్లలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం ముగ్గురు క్రికెటర్లు నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఐసీసీ ఈ లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్, జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా ఉన్నారు. వీరిలో సికిందర్ రజా ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఆగస్టు నెలలో బంగ్లాదేశ్‌తో…