HYDRA : హైదరాబాద్‌లోని సున్నం చెరువు పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్న హైడ్రా అధికారులు శనివారం స్థానికులతో కీలక సమావేశం నిర్వహించారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఆంజనేయస్వామి గుడి, ముస్లింల ప్రార్థనా స్థలం ‘చిల్లా’ మార్పు గురించి ఇరుపక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటూ హైడ్రా కమిషనర్ స్వయంగా నివాసితులతో మాట్లాడారు. చెరువు పునరుజ్జీవనంలో భాగంగా ఎఫ్‌టీఎల్‌లోని నిర్మాణాలను గట్టు వైపు మార్చాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించగా, రెండు వర్గాల స్థానికులూ ఈ నిర్ణయానికి అంగీకారం…
HYDRA : బోడుప్పల్‌లోని సుద్దకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అకస్మిక పరిశీలన నిర్వహించారు. చెరువు వద్ద FTL పేరుతో HMDA, మున్సిపల్ అధికారులు ఇళ్లపై నెంబర్లు వేశారు, ఇనుప కడ్డీలు పెట్టి ప్రజల్లో భయాందోళనలకు గురిచేశారంటూ స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 30 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, అకస్మాత్తుగా FTL పేరుతో తమపై ఒత్తిడి తేవడం అన్యాయం అని వారు వేదన వ్యక్తం చేశారు. స్థితిగతులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఇళ్లపై చేసిన…
Chamala Kiran Kumar : కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లు దండుకోవడానికే కేటీఆర్ హైడ్రా అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని…
KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని, ఈ అన్యాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం ఎందుకు వహిస్తున్నారో చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో బుల్డోజర్లను సవాల్ చేసిన రాహుల్ గాంధీ, తెలంగాణలో పేదలపై జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని నిలదీశారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై…
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేస్తోంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా వందల కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా.. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడింది. నిత్యం విధులతో బిజీగా ఉండే హైడ్రా సిబ్బంది తాజాగా క్రికెట్ ఆడి సేదతీరారు. Also Read: Diwali 2025: దీపావళికి స్వీట్స్…
HYDRA: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా బుధవారం తొలగించింది. బద్వేల్ – ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2 లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు.. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ I & II పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు…
Hydra: హైడ్రా బంజారాహిల్స్‌లో ఆక్రమణలను తొలగించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది. 5 ఎకరాలలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో కేటాయించింది ప్రభుత్వం. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో…
జైష్ ఉగ్రసంస్థ కొత్త వ్యూహాం.. అలాంటి ముస్లిం అమ్మాయిలే టార్గెట్! పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ సరికొత్త వ్యూహాం అమలు చేస్తుంది. భావోద్వేగ, మతపరమైన విజ్ఞప్తి ద్వారా సరిహద్దు వెంబడి ఉన్న విద్యావంతులైన ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యూహం అమలు చేసిందని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఇటీవల వెలువడిన ఉర్దూ ప్రచార సామగ్రిలో మక్కా, మదీనా చిత్రాలు, ఖురాన్ శ్లోకాలతో పాటు మహిళలను ప్రేరేపించడానికి భావోద్వేగ ప్రసంగాలు ఇస్తున్నారు. రోజువారీ ప్రార్థనలు, దాతృత్వం,…
హైదరాబాద్ నగరంలో విపత్తులను ఎదుర్కోవడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయపడడం, ఆస్తులను కాపాడడం వంటి ముఖ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కు ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది.
హైడ్రా ఏర్పాటయ్యాక కబ్జారాయుళ్ల నుంచి వందల ఎకరాల భూమి రక్షించారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కుత్బుల్లాపూర్ లోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ప్రభుత్వ సర్వే నెంబర్ 307 లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టింది. రూ. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసేందుకు రెడీ అయ్యింది హైడ్రా.. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి లభించింది.…