HYDRA: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా బుధవారం తొలగించింది. బద్వేల్ – ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2 లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు.. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ I & II పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్ లో పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.
“𝗡𝗼 𝗖𝗮𝗹𝗹 𝗜𝘀 𝗠𝗼𝗿𝗲 𝗜𝗺𝗽𝗼𝗿𝘁𝗮𝗻𝘁 𝗧𝗵𝗮𝗻 𝗮 𝗟𝗶𝗳𝗲”.. హైదరాబాద్ పోలీస్ స్వీట్ వార్నింగ్..!
ఈ ఫిర్యాదుతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను , రూమ్ లను హైడ్రా తొలగించింది. 3 వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెంటనే హైడ్రా ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది.
BaahubaliTheEpic : ‘బాహుబలి ది ఎపిక్’ దారిలో పుష్ప, KGF, పొన్నియన్ సెల్వన్