హైదరాబాద్ నగరంలో విపత్తులను ఎదుర్కోవడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయపడడం, ఆస్తులను కాపాడడం వంటి ముఖ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కు ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది.
హైడ్రా ఏర్పాటయ్యాక కబ్జారాయుళ్ల నుంచి వందల ఎకరాల భూమి రక్షించారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కుత్బుల్లాపూర్ లోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ప్రభుత్వ సర్వే నెంబర్ 307 లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టింది. రూ. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసేందుకు రెడీ అయ్యింది హైడ్రా.. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి లభించింది.…
HYDRA : అల్వాల్ మండలంలోని కౌకూరు ప్రాంతం వరద ముప్పు నుంచి బయటపడింది. కౌకూరుకుంట–నాగిరెడ్డికుంట మధ్య అనుసంధాన కాలువను హైడ్రా అధికారులు పునరుద్ధరించడం ఇందుకు కారణమైంది. కాలువకు అడ్డంగా గోడ నిర్మాణం జరిగిందని స్థానికులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైడ్రా విచారణ జరిపి గోడ నిర్మాణం నిజమని నిర్ధారించింది. వెంటనే కూల్చివేత చర్యలు చేపట్టింది. CM Revanth Reddy : గద్దెలు యథాతథంగా.. ఈ నెల 23న మేడారంకు సీఎం రేవంత్…
హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. చెరువులు,నాళాలు, ప్రభుత్వ స్థలాలు, బఫర్ జోన్ లోని స్థలాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కబ్జాదారుల నుంచి వందల కోట్ల విలువైన భూములను రక్షిస్తుంది హైడ్రా. ఈ క్రమంలో శంషాబాద్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన నిర్మాణాలతో పాటు ప్రహరీ గోడను తొలగించింది. 12 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమిగా బోర్డు…
హైదరాబాద్‌లో వరదలు, మురుగునీటి సమస్యలు, చెరువుల కబ్జాలు, పర్యావరణ సమస్యలు వంటి క్లిష్ట అంశాల పరిష్కారానికి ఒక ప్రత్యేక సంస్థ అవసరమని భావించిన ప్రభుత్వం, గత ఏడాది జూలైలో హైడ్రా (HYDRA) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.
రిచెస్ట్ వినాయకుడు.. ఏకంగా రూ. 474 కోట్లతో ఇన్సూరెన్స్ ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే గణపయ్య భక్తులు విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. ఊరు వాడలు వినాయక మండపాలతో ముస్తాబవుతున్నాయి. కాగా గణేష్ వేడుకలకు ముందే ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ హాట్ టాపిక్ గా మారింది. తమ వినాయకుడికి ఏకంగా రూ. 474 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంది. దీంతో రిచెస్ట్ గణపతిగా రికార్డ్ సృష్టించాడు. గతేడాది కూడా…
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుసినప్పుడు గతంలో పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి భేరీజు వేడుకోండన్నారు. ఎంత భారీ వర్షం పడినా గంటా, రెండు గంటల వ్యవధిలోనే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి.. వరద నీటిని మళ్లించడంలో హైడ్రా బాగా పని చేస్తోందని ప్రశంసించారు. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్…
Hyderabad Rains Today: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ‘హైడ్రా’ అప్రమత్తమైంది. 24/7 సేవలందించే పనిలో నిమగ్నమైంది. రహదారులపై నీరు నిలవకుండా.. ఎప్పటికప్పుడు క్యాచ్పిట్లలో, కల్వర్టుల్లో చెత్తను తొలగిస్తూ వరద సాఫీగా సాగేలా హైడ్రా బృందాలు పని చేస్తున్నాయి. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని హైడ్రా గుర్తించింది. ఇందులో 150 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఆ ప్రాంతాల్లో హెవీ మోటార్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. వరద సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లను చేసింది.…
HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉద్యోగుల జీతాల అంశంపై స్పష్టతనిచ్చారు. ఇటీవల జారీ చేసిన G.O ప్రకారం ఒక్క స్కేల్ జీతం విడుదల చేసినప్పటికీ, హైడ్రా లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు తగ్గే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ఆ అంశాన్ని తాము పూర్తిగా వివరించడంతో వారికి భరోసా కలిగిందని తెలిపారు. అలాగే మార్షల్స్ జీతాలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా…
Hydra Marshals Comments on Salary Cuts: హైడ్రా మార్షల్స్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వేతనాలు తగ్గించడంతో ఆగ్రహించిన మార్షల్స్.. నేడు తమ విధులను బహిష్కరించారు. దాంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోవడంతో పాటు 51 హైడ్రా వాహనాలు కూడా ఆగిపోయాయి. నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. విధుల బహిష్కరణపై మార్షల్స్ స్పందించారు. తమ డైరెక్టర్ జనరల్ ఆదేశాల ప్రకారం…