నానక్‌రామ్ గూడలోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు.. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఖాజగూడ చెరువులోకి మురుగు నీరు చేరకుండా కాలువ డైవర్షన్ పనులు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువు సుందరీకరణ పనులు స్పీడప్ చేయాలని దత్తత తీసుకున్న సంస్థను కోరారు. నగరంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రంగనాథ్ తెలిపారు. చెరువుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులను అందించాలని కోరారు. చెరువుల ఆక్రమణలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని.. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులు పూర్తయితే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని కమిషనర్ తెలిపారు.
READ MORE: CPI Narayana: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేదు..