Telangana Heatwave Alert: మార్చి నెల ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, తెలంగాణలో ప్రతి రోజూ 35 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. హైదరాబాద్ నగరంతో పాటు ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, జనగామ, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతుంది. ఈ ఎండల తీవ్రతకి ప్రజలు బయటకు రావాలంటే భయ పడుతున్నారు. దీంతో ఒంటిగంట సమయంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనపడుతున్నాయి.
Read Also: Nara Lokesh-Nimmala: రెస్ట్ తీసుకుంటారా?.. సభ నుంచి సస్పెండ్ చేయించాలా?
అయితే, గ్రేటర్ హైదరాబాద్ లో ఎండల తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 4, 5 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుంది. వడగాడ్పులు కూడా తీవ్రంగా వీయనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఎండ తాపంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో కూలర్లు, ఏసీలకు గిరాకీ పెరగ్గా.. మరి కొందరు మాత్రం పాత వాటికి రిపేర్లు చేయించుకుంటున్నారు. కాగా, వారం రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు, రోజు వారి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.