జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి నిఘా వైఫల్యమే కారణమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దాడిని ఊచకోతగా ఆయన అభివర్ణించారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది ఉరి ప్రాంతం, పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని, బాధాకరమైందన్నారు. ఈ సంఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాని డిమాండ్ చేశారు.
READ MORE: Meenakshi Natarajan: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత ప్రచారం.. గ్రామస్థాయి నుంచే జరగాలి..
“పహల్గామ్‌లో మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ ఘటనకు నిఘా వైఫల్యమే కారణం” అని ఒవైసీ హైదరాబాద్‌లో విలేకరులతో అన్నారు. ఈ ఉగ్రవాదులందరికీ ప్రభుత్వం గుణపాఠం నేర్పుతుందని, బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
READ MORE: Gorantla Madhav: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు గోరంట్ల తరలింపు!
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రమూకల దాడిపై ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిన్న కూడా స్పందించారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి అమాయకులను చంపడం దుర్మార్గమైన చర్య అన్నారు. టూరిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్రానికి సూచించారు. కాగా, మంగళవారం అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పలువురు పర్యటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అటాక్ చేశారు. ఈ ఘటనలో 28 మంది మరణించినట్లు సమాచారం.