ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు గడువు ఈరోజుతో ముగియనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ రూ.1,910 కోట్లు వసూలు చేసింది. 2023-24 సంవత్సరానికి మొత్తం రూ.1,917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రూ.2,000 కోట్ల వసూలు లక్ష్యంగా జీహెచ్ఎంసీ పని చేస్తోంది.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్‌కు ఐజీ ఎం. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి.
ఎవరైనా లా అండ్ ఆర్డర్ ను తప్పించేలా పని చేస్తే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నాను అని సీఎం రేవంత్ తెలిపారు. ఇక, హైదరాబాద్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉండాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.. అందులో భాగంగా మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టాం.. దేశానికి ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నాం.
ఉద్యోగం సాధించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తున్నారా? అయితే మీ డ్రీమ్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. నిరుద్యోగులకు హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) గుడ్ న్యూస్ అందించింది. వివిధ విభాగాల్లో 32 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భర్తీకానున్న పోస్టుల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) 08, టెక్నీషియన్ C 21, జూనియర్ అసిస్టెంట్ 03 ఉన్నాయి. Also Read:Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్……
Local Body Election: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.
Betting Apps :బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులన్నింటినీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు బదిలీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమాచారం అందిస్తూ, ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదై ఉన్నాయని స్పష్టం చేశారు. నెలలుగా పెద్ద దందాగా మారిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ట్విట్టర్ వార్ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ కీలక వ్యాఖ్య చేశారు. “తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకపూరిత నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం ఒక పెద్ద హరిత ప్రాంతాన్ని కోల్పోనుంది. కంచే-గచ్చిబౌళిలో 400 ఎకరాల భూమిని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను,” అని కేటీఆర్…
ఈ సారి గొడవ జరిగితే నేనే ముగ్గురు పిల్లలను చంపుతానని చెన్నయ్య అన్నాడని రజిత తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. రజిత కూడా ముగ్గురు పిల్లలు చంపి నేను చచ్చిపోతానని చెప్పింది.. కానీ, పిల్లలను చంపడం ఏంటో తెలియట్లేదు.. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చినా ఏం కాకపోతుండే.. నా బిడ్డ రజిత చచ్చిపోయిన పీడా పోయేది అని వారు పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి వెళ్లిన ఓ పాస్టర్ రాజమండ్రి శివార్లలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది.