లేడీ అఘోరీకి ఊహించని షాక్ ఇచ్చారు పోలీసులు. ఇటీవల పూజల పేరుతో తనను లక్షల్లో మోసం చేశాడని ఓ సినీ లేడీ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దద్యాప్తు చేశారు మోకిలా పోలీసులు. ఈ క్రమంలో మోకిలా పోలీసులు లేడీ అఘోరీని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ,మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువస్తున్నారు మోకిలా పోలీసులు. అఘోరీతో పాటు ఇటీవల తను వివాహం చేసుకున్న వర్షిణిని కూడా నగరానికి తరలిస్తున్నారు పొలీసులు.
Also Read:Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు..
రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, ప్రొద్దుటూర్ మండలానికి చెందిన లేడీ ప్రొడ్యూసర్ లేడీ అఘోరీ శివ విష్ణు బ్రహ్మ అట్లూరి మోసాలను ఇటీవల బయటపెట్టింది. లేడీ అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు తెలిపింది. పరిచయం అయిన 2 నెలల తర్వాత ప్రొద్దటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు డిన్నర్ కు వచ్చిందని వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని తెలిపింది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని ఆ మహిళా ప్రొడ్యూసర్ వెల్లడించింది. లేడీ అఘోరీ మాటలు నమ్మి పూజకు అంగీకరించానని తెలిపింది.
Also Read:RK Roja: పవన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు కోసం ఉన్న నాయకుడు..
వారం రోజుల్లో పూజ చేద్దామని అందుకు ఖర్చుల కోసం రూ. 5 లక్షలు లేడీ అఘోరీ అకౌంట్ లో వేశానని తెలిపింది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫాం హౌస్ లోకి తీసుకెళ్లి పూజ చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో రూ. 5 లక్షలు తన అకౌంట్ లో వేయాలని లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరి భయపెట్టిందని చెప్పింది. అఘోరి మాటలకు భయపడిపోయి రూ. 5 లక్షలు అకౌంట్ లో వేశానని ఇలా మొత్తం రూ. 10 లక్షలు ముట్టజెప్పానని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. దీన్ని అలుసుగా చేసుకుని అఘోరి మాతతో పూజ పూర్తి చేసుకున్నావు కనుక ఇంకా రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే నిన్ను, కుటుంబ సభ్యులను మంత్ర శక్తులతో అంతమొందిస్తానని.. బెదిరింపులకు పాల్పడ్డట్లు కంప్లైంట్ లో పేర్కొంది.