హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వరుణుడు దంచికొట్టాడు. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్.. సచివాలయం.. ఆబిడ్స్.. నాంపల్లి ..పటాన్ చెరువు, శేర్లింగంపల్లి ..సికింద్రాబాద్‌లలో భారీ వర్షం కురిసింది. భారీగా కురిసిన వానతో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Also Read:Kakani Govardhan Reddy: హైకోర్టులో మాజీ…
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ ఐఆర్టి టీమ్స్ వాటిని క్లియర్ చేసింది. సెక్రటేరియట్, రాజ్ భవన్ రోడ్, మసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాలతో…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థిలోకం గర్జిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కోసం చెట్లను నరికేసి భూములను వేలం వేయడాన్ని పర్యావరణవేత్తలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి HCU భూముల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. Hcu.. కంచ గచ్చిబౌలి స్థలాల్లో ఎలాంటి పనులు చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. Also Read:Hyderabad: అమీన్ పూర్ పిల్లల…
ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకి పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8వ తేదీన మళ్లీ తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ రావు పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా శ్రవణ్ రావు తప్పించుకుంటున్నారు. 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన సెల్ ఫోన్లు కావాలని సిట్ కోరింది. రెండు సెల్ ఫోన్లు ఇవ్వాలని అడిగితే ఒకటే ఇచ్చి శ్రవణ్ రావు తప్పించుకున్నారు. Also…
Jagadish Reddy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం పోరాడుతున్న విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.
Jupally Krishna Rao: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీయూలో ఒక్క ఇంచు భూమి కూడా తీసుకోలేదు అని తేల్చి చెప్పారు.
Pastor Praveen: హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. వివిధ కోణాల్లో పూర్తిస్థాయి నివేదికలతో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు రేపు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ముందు విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. ఈ రోజు (ఏప్రిల్ 2న) విచారణకు రావాలంటూ శ్రవణ్ రావుకు గత విచారణ సమయంలో సిట్ నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశలో మరో అడుగు పడింది. గ్లోబల్ టెక్నాలజీ సంస్థ ‘క్లియర్‌టెలిజెన్స్’ తన ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్‌ను తాజాగా హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో ప్రారంభించింది. క్లియర్‌టెలిజెన్స్ సంస్థను తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఈవో ఓవెన్ ఫ్రీవోల్డ్, మేనేజింగ్ పార్టనర్ అనీల్ భరద్వాజ్, హరికృష్ణ (డైరెక్టర్), ఎంఎం ఇన్ఫో టెక్నాలజీస్ ఫౌండర్ మురళి (నార్త్ కరోలినా), శ్రీధర్ సుస్వరం (జీఎం…