DGP Jitender: NTVతో తెలంగాణ డీజీపి జితేందర్ మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీయులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
మదర్సలోఉన్న పిల్లలు ఈ దేశం పిల్లలు అని మీ ఎస్పీ చెప్పగలరా అని ఎంపీ రఘునందన్ రావు అడిగారు. టోపీ పెట్టుకుంటే మనోడు అని కాపాడుతున్నారు.. అక్కడ మదర్సలో ఉండే 12 ఏండ్లలోపు పిల్లలకు హిందూ సమాజంపై ద్వేషం ఎందుకు..? అని ప్రశ్నించారు.
కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలు పెట్టా.. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది.. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలో లాగా లేను.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా.. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. మహిళలను కోటీశ్వరులను చేయడమే మా అజెండాగా పెట్టుకున్నాం.. మహిళా పారిశ్రామిక వేత్తలను బడా పారిశ్రామిక వేత్తలుగా చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం ఎడారి దేశం దుబాయ్ కి వెళ్లి అష్టకష్టాలు పడిన వారు చాలామందే ఉన్నారు. ఏజెంట్ ల చేతుల్లో మోసపోయి స్వదేశం తిరిగిరాలేక నానా అవస్థలు పడ్డవారు కూడా ఉన్నారు. ఇలాగా ఓ వ్యక్తి దుబాయ్ కు వెళ్లి అక్కడే చిక్కుకుపోయాడు. అనారోగ్యానికి గురైన అతడు తనను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని సెల్ఫీ వీడియోలో మంత్రిని వేడుకున్నాడు. దీనికి స్పందించిన రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గల్ఫ్…
పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై దౌత్య దాడికి పూనుకుంది. సిందూ జలాల ఒప్పందం, వీసాల రద్దు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలర్ట్ చేసింది. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వీసాలు రద్దు చేసి వెనక్కి పంపించాలని కేంద్రం ఆదేశించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాదులో 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించింది. Also Read:Realme 14T 5G: 6.67-అంగుళాల…
అఘోరీ శ్రీనివాస్‌ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. యూపీలో అరెస్ట్ చేసి నిన్న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు పోలీసులు.. అఘోరీ ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. మరో వైపు వర్షిణిని భరోసా సెంటర్‌కు తరలించినట్లు సమాచారం.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ బాగోతం బయటపడింది. పిడియాక్ట్రిషన్ అంటూ ఆసుపత్రిలో వైద్యం నిర్వహించాడు నకిలీ డాక్టర్.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. మియాపూర్ లోని ఓ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ అంశాన్ని మియాపూర్ పోలీసులు నెల రోజులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వద్దని హాస్పిటల్…
మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్ట్ అయ్యారు.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది.
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ సీఐడీకి బదిలీ చేసింది. పంజాగుట్ట, మియాపూర్ లో నమోదైన కేసులో 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను విచారించారు. మరోవైపు.. ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పైన సిట్ ఏర్పాటు చేసింది. ఒకవైపు సీట్ తో పాటు కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది.