CPI Narayana: బిగ్ బాస్, అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం తెస్తాయి.. బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలి.. అందాల పోటీలను రద్దు చేయాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బిగ్ బాస్ కు మొదటి నుంచి మేము వ్యతిరేకం.. సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అన్నారు.. మంచి వయసులో ఉన్న యువతి యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే.. ప్రకృతి రీ యాక్షన్స్ కు లోనవుతారన్న ఆయన.. అదే సమయంలో తప్పు చేస్తారని తెలిపారు.. అయితే, బిగ్ బాస్ పేరుతో జరుగుతోన్న చెడు సంస్కృతికి మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు..
Read Also: Samantha : సమంతకు స్టేజ్ పైనే ఐ లవ్ యూ చెప్పిన యంగ్ హీరో..
బిగ్ బాస్ పై పోలీసులు స్టేషన్ కు వెళ్తే కేసు నమోదు చేయలేదు.. హై కోర్టులో పిల్ వేస్తే మా పిల్ ను స్వీకరించి నాగార్జున, ఎండీకి నోటీసులు జారీ చేశారని గుర్తుచేశారు సీపీఐ నారాయణ.. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ ను పరిగణనలోకి తీసుకొని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.. హైదరాబాద్ లో అందాల పోటీ అంటే ఆడవాళ్లను అంగడి సరుకుగా మార్చినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు.. బిగ్ బాస్, అందాల పోటీలు రెండూ ఒక్కటే చర్యలేజజ అందాల పోటీ వల్ల టూరిజం ఎందుకు పెరుగుతుంది..? డబ్బు నష్టం తప్పా..? అని ప్రశ్నించారు. పవిత్రమైన స్త్రీ జాతికి కళంకం తెచ్చేది.. బిగ్ బాస్, అందాల పోటీలు అని దుయ్యబట్టారు.. చీప్ గా కాకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేయాలనే సందేశాన్ని ఇలాంటి షోలు ఇస్తున్నాయన్నారు.. మన దేశంలో ఉన్న కుటుంబ సంప్రదాయం ఎంతో గొప్పది.. ఇలాంటి షోలకు తావులేదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..