Ponnam Prabhakar: ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారు..
- మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు
- ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది
- సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారు..
- ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఈరోజు, రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఈరోజు, రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని తెలిపారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు.
Also Read:Islam- Terrorism: ఇస్లాం ఉన్నంత వరకూ ఉగ్రవాదం ఉంటుంది.. ఇందులో అనుమానాలొద్దు..!
Also Read
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,కార్మికుల సంక్షేమం ,ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. సమస్యలు తొలుగుతున్నాయి. సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు. ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం.. ఒక్కటైన ఇబ్బంది పెట్టమా.. ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారు.. గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేశారు.. ఒక్క బస్సు కొనుగోలు చేయలేదు, ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు వాడుకున్నారు.. టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు చెల్లించింది.
Also Read:JR. NTR : మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు ‘డబుల్’ ధమాకా
2017 పే స్కేల్ 21% శాతం ఇచ్చింది. సంవత్సరానికి 412 కోట్లు భారం పడుతుంది. పిఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న 1039 కోట్లు చెల్లించాం.. నెలవారీ PF కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లించబడుతుంది.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ బకాయిలు ఉద్యోగులకు 345 కోట్లు రూపాయలు చెల్లించాం.. నెలవారీ సీసీఎస్ కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లించబడుతుంది.. 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టినం.. ప్రభుత్వం టీజీఎస్ ఆర్టీసీలో 3038 మంది ఉద్యోగులను రిక్రూట్‌మెంట్ చేయడానికి అనుమతి ఇచ్చింది.. కొత్త బస్సులు కొనుగోలు చేశాం, తార్నాక ఆసుపత్రి ని సూపర్ స్పెషాలిటీ గా మార్చామని తెలిపారు.
తాజావార్తలు
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!